Monday, December 5, 2022
Monday, December 5, 2022

మేం అధికారంలోకి వచ్చాక అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తాం

: ప్రియాంకా గాంధీ

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్‌షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏ హామీ ఇచ్చినా తప్పకుండా నెరవేస్తుందని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చామని ఆమె చెప్పారు. ప్రజల బాగోగులు పట్టని బీజేపీని గద్దె దించాలని ప్రియాంక ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రియాంక ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ కూడా వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img