Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దిల్లీ లిక్కర్‌ కేసు.. దిల్లీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఇంట్లో ఈడీ సోదాలు

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పర్సనల్‌ అసిస్టెంట్‌ (పీఏ) ఇంటిపై శనివారం ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు చేసింది. ఈ విషయాన్ని సిసోడియా ట్విటర్‌ ద్వారా వెల్లడిరచారు. ‘‘వారు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నా ఇంటిపై దాడి చేశారు. నా బ్యాంక్‌ లాకర్లను పరిశీలించారు. మా గ్రామానికి వచ్చి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. కానీ, నాకు వ్యతిరేకంగా ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు. ఈ రోజు నా పీఏ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఏం లభించలేదు. అయినా.. అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీకి గుజరాత్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఎక్కువైంది అని ఆప్‌ నేత ట్వీట్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు. మనీష్‌ సిసోడియా వాదనకు బీజేపీ నేత గౌరవ్‌ భాటియా కౌంటర్‌ ఇస్తూ.. అతను (సిసోడియా) నిందితులలో నంబర్‌ వన్‌ అని, అలాంటి కేసును దర్యాప్తు సంస్థలు ఎందుకు పరిశీలించకూడదో చెప్పాలి అన్నారు. మరోవైపు దేశ రాజధాని ఢల్లీిలో ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఈడీ సోదాలను వేగవంతం చేసింది. మనీష్‌ సిసోడియా సన్నిహితులపై కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img