Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మోదీజీ..మీ విద్వేషాన్ని పార్లమెంటు వెలుపల చూపండి

: మల్లిఖార్జున ఖర్గే
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానమిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలపై ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ధన్యవాద తీర్మానాన్ని దుర్వినియోగం చేశారని, సిద్ధాంతాలను ఆయన గాలికి వదిలేశారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌పైన, గాంధీజీ, నెహ్రూజీ, రాహుల్‌పైన మోదీకి ద్వేషం ఉంటే ఆ మాటలన్నీ పార్లమెంటు వెలుపల వెళ్లగక్కుకోవచ్చని సూచించారు. పెగాసస్‌, కోవిడ్‌, ద్రవ్యోల్బణం వంటి అసలు విషయాలను ఆయన పక్కనపెట్టేసి ‘మోషన్‌ ఆఫ్‌ థాంక్స్‌’ను దుర్వినియోగం చేయడం, సిద్ధాంతాలను గాలికి వదిలేయడం ఏమిటని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img