Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వణికిస్తోన్న చలి పులి

దేశవ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తీవ్రంగా వీస్తున్న చలిగాలులు
కశ్మీర్‌లో గడ్డకట్టుకుపోయిన చెరువులు, జలపాతాలు
శ్రీనగర్‌ / చండీఘర్‌ / భువనేశ్వర్‌ / నాగపూర్‌ / కోల్‌కతా :
దేశవ్యాప్తంగా చలి పులి తన పంజా విసురుతోంది. కశ్మీర్‌లో చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. గడ్డకట్టుకుపోయే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జలపాతాలు, కాలువలు, చెరువులు గడ్డకట్టుకుపోయి. గడచిన వారంరోజులుగా వ్యాలీ అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. దాల్‌ సరస్సు కూడా గడ్డకట్టిపోవడంతో నగరంలో నివశించే వారు ఇంట్లో నీళ్లు రాక, గొట్టాల్లో నీళ్లు గడ్డకట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రాత్రి శ్రీనగర్‌లో మైనస్‌ 5.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవ్వగా, అంతకుముందు రోజు ఆరు డిగ్రీలు నమోదైంది. అలాగే బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌ రిసార్ట్స్‌లో రికార్డు స్థాయిలో మైనస్‌ 5.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పంజాబ్‌, హర్యానాల్లో సోమవారం తీవ్ర చలిగాలులు వీచాయి. హిస్సార్‌లో 0.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అంబాలలో 5.1 డిగ్రీలు, నార్నౌల్‌లో 1.3 డిగ్రీలు, రోప్‌ాతక్‌లో 2.6 డిగ్రీలు, కార్నెల్‌లో 3.4 డిగ్రీలు, సిర్సాలో 3.2 డిగ్రీలో ఫతేహాబాద్‌లో 3.1 డిగ్రీలు, భివానీలో 2.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, గుర్గావ్‌లో మాత్రం 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్‌లోని మోగాలో 0.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఒడిశా ప్రజలు కూడా తీవ్ర చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా 13 ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, కన్‌డామాల్‌ జిల్లాలోని దరింగ్‌బడిలో 4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందని, సోమవారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రaార్స్‌గూడలో 5.6, ఫూల్‌బనిలో 6.5, సోనెపూర్‌లో (6.9), కియోన్‌జార్‌లో 7.4, సుందెర్హా, బోలన్‌గిర్‌లో 8 డిగ్రీలు, భవానీపట్నాలో 8.9, సంబల్‌పూర్‌, తాల్చేర్‌, హిరాకుడ్‌లలో 9 డిగ్రీలు, టిట్లాఘర్‌లో 9.3, బరిపాడలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నాగాపూర్‌ ప్రజలు కూడా సోమవారం చలికి తట్టుకోలేకపోయారు. విదర్భా ప్రాంతంలో 7.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్టు రీజనల్‌ మెట్రోలాజికల్‌ సెంటర్‌ (ఆర్‌ఎంసీ) తెలిపింది. రానున్న మూడురోజుల్లో కూడా వాతావరణం ఇలానే ఉంటుందని పేర్కొంది. డిసెంబర్‌ 23 తరువాత ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సోమవారం కోల్‌కతా వణికిపోయింది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుంది వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img