Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వరుసగా రెండో రోజూ వెయ్యికి దిగువన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ వెయ్యిలోపే నమోదయ్యాయి. 196 రోజుల తర్వాత మంగళవారం 862 కేసులు నమోదవగా, తాజాగా మరో 830 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768కి చేరింది. ఇందులో 4,40,95,180 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,981 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 21,607 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 1771 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. మొత్త కేసుల్లో 0.5 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం ఉందని తెలిపింది. ఇక మరణాల రేటు 1.2 శాతంగా ఉందని, రోజువారీ పాటివిటీ 0.67 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 219.57 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img