Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సైరస్‌ మిస్త్రీ మృతి నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా కీలక నిర్ణయం

ఇకపై తాను వెనుక సీట్లో ఉన్నా సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటానన్న ఆనంద్‌ మహీంద్రా
ప్రముఖ వ్యాపార దిగ్గజం సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో కారు చాలా వేగంగా ప్రయాణిస్తోందని తెలిసింది. అంతేకాదు, ఆ సమయంలో వెనుక సీట్లో కూర్చున్న సైరస్‌ మిస్త్రీ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా సరే సీట్‌ బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. మీరందరూ కూడా వెనుక సీట్లో ఉన్నప్పుడు కూడా సీటు బెల్టు పెట్టుకుంటామనే ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పారు. మన కుటుంబాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని… మనం ప్రాణాలతో ఉండటం మన కుటుంబాలకు చాలా అవసరమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img