Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం

కొవిడ్‌ సమయంలో ఎందరో ఆపన్నులకు సాయంచేసిన రియల్‌హీరో సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే జనవరి 22 నుంచి రష్యాలోని కజాన్‌లో జరగనున్న స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ వింటర్‌ గేమ్స్‌కు భారత్‌ తరపున సోనూసూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ వింటర్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ సూద్‌ లీడ్‌ చేయనున్నారు. స్పెషల్‌ ఒలింపిక్స్‌కు ఇండియా అథ్లెట్లు చేస్తున్న ప్రయాణంలో తానూ భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కుటుంబంలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img