Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

జమ్ము: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్ము నుంచి అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. దక్షిణ కాశ్మీర్‌ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తయిన గుహ వద్ద బేస్‌ క్యాంపులకు ఇక్కడి నుంచి కొత్త బ్యాచ్‌ వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఈనెల 8వ తేదీ శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్‌ వద్ద కురిసిన భారీ వర్షంతో ఒకేసారి పెద్ద ఎత్తున వరద రావడంతో 16 మంది మరణిం చారు. దాదాపు 40 మంది గల్లంతయ్యారు. ‘వాతావరణం అనుకూలిం చకపోవడంతో జమ్ము నుంచి కశ్మీరులోని జంట బేస్‌ క్యాంప్‌లకు అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశాం. అమర్‌నాథ్‌ వైపు కొత్త బ్యాచ్‌ ఎవరినీ అనుమతించడం లేదు’ అని ఒక అధికారి చెప్పారు. జూన్‌ 29 నుంచి జమ్ములోని భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి 10 బ్యాచ్‌ల్లో మొత్తం 69,535 మంది యాత్రికులు లోయకు బయలు దేరారు. రక్షా బంధన్‌ సందర్భంగా ఈ యాత్ర ఆగస్టు 11న ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img