Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలోనే ఎక్కువగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్న కేంద్ర ఆర్థిక శాఖ

ఏపీ డ్రగ్స్‌ రాజధానిగా మారిందంటూ కేంద్రం వెలువరించిన ఓ నివేదిక ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఏపీలో డ్రగ్స్‌ దందాను ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికలో కేంద్రం బట్టబయలు చేసింది. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల కంటే అత్యధికంగా… కేంద్ర బలగాలు ఏపీలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. ఏపీలో… 18,267 కేజీల డ్రగ్స్‌ను సీఆర్‌పీఎఫ్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిరచింది. 1,057 కేజీల గంజాయి, 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్ర చందనాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. తెలంగాణలో 1012 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం నివేదికలో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img