Friday, April 26, 2024
Friday, April 26, 2024

చన్నీ మంత్రివర్గంలో ఇసుక మాఫియా

ఆప్‌ నేత కేజ్రీవాల్‌
చండీగఢ్‌ : పంజాబ్‌లో సీఎం చన్నీ బంధువు నివాసం సహా అనేక ప్రాంతాలలో ఈడీ సోదాల తర్వాత దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక్కడ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ముఖ్యమంత్రి(చన్నీ) బంధువు నివాసంపై ఈడీ సోదాలు చేయడం విచారకరం’ అని అన్నారు. చన్నీ సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన చమ్‌కౌర్‌ సాహిబ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతాయో కూడా ఆప్‌ నాయకుడు రాఘవ్‌ చద్దా చూపించారని తెలిపారు. ‘దీనిని బయటపెట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. దానిని సమర్థించడానికి కూడా ప్రయత్నించారు. ఆయన (సీఎం)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమ మైనింగ్‌లో కుటుంబం పాలుపంచుకున్న వ్యక్తి నుంచి పంజాబ్‌ భవిష్యత్తు కోసం ఏమి ఆశించవచ్చు’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ‘ఆయన (చన్నీ) మంత్రివర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఉన్నారని, వారిని చన్నీ సాహబ్‌ స్వయంగా ప్రోత్సహిస్తున్నారని మేము పదేపదే చెబుతున్నాం’ అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘చన్నీ సాహబ్‌ వారిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలేదు?’ అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img