Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రాల వద్ద 20.16 కోట్ల కొవిడ్‌ వాక్సిన్లు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20.16 కోట్లకు పైగా బ్యాలెన్స్‌, ఉపయోగించని కోవిడ్‌-19 వాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘భారత ప్రభుత్వం ఇప్పటివరకు 192.27 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్‌ వాక్సిన్‌ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించాం’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 వాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 వాక్సినేషన్‌ కార్యక్రమం గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా, భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌ వాక్సిన్‌లను ఉచితంగా అందించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాక్సిన్‌ల లభ్యతను బట్టి టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img