Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జ్ఞానవాపీ మసీదు కేసు.. వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపీ మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్‌ను సమర్థించింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో అంజుమన్‌ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ పక్షాల తరఫున లాయర్‌ విష్ణు శంకర్‌ జైన్‌ మాట్లాడుతూ.. ముస్లిం పక్షం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా నిర్వహించదగినదని సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే విశ్వేశ్‌ పేర్కొన్నారని చెప్పారు. మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమాన్‌ ఇంతజామియా కమిటీ.. మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్‌ బోర్డుకు చెందుతాయని అఫిడవిట్‌ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img