Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు..!

తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది.తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టణం, తరువారూర్‌ జిల్లాల్లో గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తిరువారూర్‌లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img