Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాలుగో దశ పోరులో హోరెత్తిన ప్రచారం

60 నియోజకవర్గాల్లో 23న పోలింగ్‌
తేలనున్న 624 మంది భవితవ్యం

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగో దశలో ఈ నెల 23వ తేదీన 9 జిల్లాల్లోని 60 నియోజకవర్గాలలో పోలింగ్‌ జరగనున్నది. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్‌బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్‌ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్‌ ప్రాంతంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ధారణ కావడంతో నాలుగో దశ పోరును ఆయా పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గాలలో చివరిరోజైన సోమవారం అన్ని పార్టీలు ప్రచారం హోరెత్తించాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగిసింది. 403 శాసనసభా స్థానాలలో తొలి మూడు దశల్లో 172 సీట్లకు పోలింగ్‌ జరిగింది. ఇక నాలుగో దశలో 624 మంది అభ్యర్ధులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫిలిబిత్‌, లఖింపూర్‌ ఖేరి, సీతాపూర్‌, హర్దోయ్‌, లక్నో, రాయ్‌బరేలి, ఫతేపూర్‌, బందా జిల్లాల్లోని 60 అసెంబ్టీ స్ధానాలకు నాలుగో దశలో పోలింగ్‌ జరగనుంది. వీటిలో 16 స్ధానాలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా 58 స్ధానాల్లో ఎస్పీ అభ్యర్ధులు పోటీలో ఉండగా రెండు స్ధానాల్లో ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ పార్టీకి మద్దతునిస్తోంది. బీఎస్పీ, కాంగ్రెస్‌ మొత్తం 60 స్ధానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 57 స్ధానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్‌ (ఎస్‌) మూడు స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక ప్రచారానికి వస్తే సీఎం యోగి ఆదిత్యానాథ్‌ó్‌ రాయ్‌బరేలిలో బహిరంగ సభలో పాల్గొనగా ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ హర్దోయ్‌, రాయ్‌ బరేలి, సుల్తాన్‌పూర్‌, అమేథిల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక మిగిలిన దశల ఎన్నికలకు ఎస్పీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేశ్‌ బాబాయి శివపాల్‌ యాదవ్‌ పేరు చేర్చారు. ఎస్పీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలశ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, డిరపుల్‌ యాదవ్‌ తదితరులున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేశ్‌ ్‌ సారధ్యంలోని ఎస్పీ ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్‌ తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img