Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాసిక్‌లో పోటెత్తిన వరద..

వర్షాలు, వరదలకు మహారాష్ట్ర కుదేలవుతుంది. ఇప్పటికే అక్కడ వరదల వల్ల 76 మంది చనిపోయారు. కేవలం ఒక్కరోజులోనే 9 మంది చనిపోయారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీట మునిగాయి. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తతడంతో నాసిక్‌ దగ్గర నదిలో ప్రవాహం భారీగా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం వేగం పెరిగింది. దీంతో అక్కడ పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిణామంతో నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు మహారాష్ట్రలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 24 గంటల్లోనే తొమ్మిది మంది చనిపోయారు. పిడుగుపాటు, కొండ చరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, వరదల వల్ల వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అలాగే సుమారు ఎనిమది వందలకుపైగా ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. అలాగే వరదల వల్ల నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img