Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

నేటి నుంచి యూపీలో రాత్రి కర్ఫ్యూ

లక్నో : అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూతో సహా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ రాత్రి కర్ఫ్యూ 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులో ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ఇక్కడ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో వివాహం వంటి కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 200కు పరిమితం చేయాలని ఆదేశించారని, ఈ కార్యక్రమాలు కోవిడ్‌`19 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, నిర్వాహకులు ఈ విషయాన్ని స్థానిక యంత్రాంగాన్ని తెలియజేయాలని అధికారి వివరించారు. వ్యాపారులందరూ తమ సంస్థల్లో ‘నో మాస్క్‌, నో గూడ్స్‌’ విధానాన్ని అనుసరించాలి. వీధుల్లో లేదా మార్కెట్లలో ప్రతి ఒక్కరికీ మాస్కులు తప్పనిసరి చేయాలి. మార్గదర్శకాలను పాటించేలా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుండి ఉత్తరప్రదేశ్‌కు వచ్చేవారిని గుర్తించి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేలా చూడాలి’ అని సీఎం ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారని అధికారి చెప్పారు. అలాగే బస్సులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో అదనపు నిఘా నిర్వహించాలని, బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పరీక్షించిన తర్వాత వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించాలని, అవసరమైతే వారిని ఆసుపత్రుల్లో చేర్చాలని లేదా క్వారంటైన్‌లో ఉంచాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img