Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీజేపీని వీడిన బెంగాలీ నటి స్రవంతి ఛటర్జీ

కోల్‌కతా : బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీని వీడారు. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీలో చేరిన ఆమె టీఎంసీ ప్రముఖుడు పార్థ ఛటర్జీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ‘పశ్చిమ బెంగాల్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి చొరవ, చిత్తశుద్ధి లేకపోవడం కారణంగా బీజేపీని వీడినట్లు తెలిపారు. ఈ తూర్పు రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ అధికారం నుంచి దింపే విషయంలో విఫలమైన తర్వాత ఈ 34 ఏళ్ల నటి కాషాయ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ‘గత రాష్ట్ర ఎన్నికలలో నేను పోటీ చేసిన పార్టీ బీజేపీతో అన్ని సంబంధాలు తెంచుకున్నాను. బెంగాల్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో చొరవ, చిత్తశుద్ధి లేకపోవడటమే కారణం’ అని ఛటర్జీ ట్వీట్‌ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌ బీజేపీ, ఛటర్జీ తీసుకున్న నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ‘అది పార్టీని ప్రభావితం చేయదు’ అని పేర్కొంది. ‘ఎన్నికల తర్వాత ఆమె పార్టీలో ఉందో లేదో నాకు తెలియదు. అది పార్టీపై ప్రభావం చూపదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ అగ్రనేతలపై విమర్శలు ఎక్కుపెడుతున్న బీజేపీ నాయకుడు తథాగత రాయ్‌ స్పందిస్తూ, ఛటర్జీ పార్టీ నుంచి వైదొలగడం ‘మంచి విముక్తి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img