Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బూస్టర్‌ డోస్‌గా అందుబాటులోకి నాసల్‌ వ్యాక్సిన్‌..

కొవిడ్‌-19 నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా అందించే నాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్కోవాక్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత వారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ. 800కు విక్రయించనుండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ . 325 చెల్లించి ఇన్కోవాక్‌ను సేకరిస్తాయి.ఇన్కోవాక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ కొవిన్‌ యాప్‌లో ఉండగా జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది. 18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌గా ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ను ఇస్తారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి రంగంలో భారత్‌ పరిశోధన, అభివృద్ధికి ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణ మరో ఉదాహరణని ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా మండలి (ఎన్‌టాగి) చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. దీన్ని సులభంగా వాడే వెసులుబాటుతో పాటు ఈ వ్యాక్సిన్‌ శ్వాస నాళాల నుంచి శ్వాసకోశ వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా రోగనిరోధక వ్యవస్ధను పెంచుతుందని వెల్లడిరచారు. ఇక ఈ వ్యాక్సిన్‌పై మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా చేపట్టామని ఇన్కోవాక్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు కొవిడ్‌-19 కేసులు చైనాలో అత్యంత వేగంగా ప్రబలడం, దారుణ పరిస్ధితులు నెలకొన్న నేపధ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా పలు ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img