Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహారాష్ట్రలో బర్డ్‌ ఫ్లూ భయం.25వేల కోళ్లను చంపాలని ఆదేశం

మహారాష్ట్రలో బర్డ్‌ ఫ్లూ భయం నెలకొంది. థానే జిల్లాలోని షాహాపూర్‌ తహసీల్‌ పరిధిలోని వెహ్లోలి గ్రామంలోని కోళ్లఫారంలో 100 కోళ్లు అకస్మికంగా మరణించాయి.బర్డ్‌ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. వైరస్‌ వ్యాప్తి మరింత చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజేష్‌ జె నర్వేకర్‌ ఆదేశించారు. బర్డ్‌ ఫ్లూ ప్రబలకుండా నియంత్రించడానికి వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25వేల కోళ్లను చంపాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు..థానే జిల్లాలో ఏవియన్‌ఇన్ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయినట్లు పరీక్షల ఫలితాలు నిర్ధారించాచయని థానే జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భౌసాహెబ్‌ దంగ్డే చెప్పారు.థానే జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించడం గురించి కేంద్ర మత్స్య,పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img