Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముంబైలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

కరోనా కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు క్రమంగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా నైట్‌ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. అయితే ముంబైలో కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూని ఎత్తివేశారు. కరోనా ఆంక్షలను కూడా సడలించారు. ఈ మేరకు నేటి నుంచే నగరంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్‌ పార్క్‌ లకు అనుమతి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామర్థ్యంతోనే నడిపించాలని నిబంధనను పెట్టారు. అలాగే బీచ్‌ లతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను గతంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అందరూ మాస్క్‌ లను తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img