Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ముంబై సహా పలు నగరాల్లో భారీ వర్షాలు

మహారాష్ట్రలో జల విలయం కొనసాగుతోంది. బుధవారం కూడా ముంబై సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.
మరో 5 రోజులు
శుక్రవారం వరకు ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. నగరంలోని కొన్ని రూట్లలో రైలు, బస్సు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిరది. లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.సోమవారం నుంచి ముంబయిలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని నదుల్లో నీటి స్థాయి పెరుగుతూనే ఉంది. రాయిగఢ్‌, రత్నగిరి జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేశారు. ముంబైలోని చునాభట్టి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు.
రాష్ట్రంలో వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యంత్రి ఏక్‌నాథ్‌ శిందే సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులకు ఆయన సూచించారు. సహాయకచర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img