Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజకీయ పదవిగా గవర్నర్‌

. బీజేపీ నేతల నియామకాలపై రాజా విమర్శ
. లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల ఐక్యత అత్యవసరమని ఉద్ఘాటన

కోయంబత్తూర్‌ : రాజ్యాంగబద్ధ పదవులు రాజకీయబద్ధమైనవిగా మారుతున్నాయని కొత్త గవర్నర్ల నియామకాన్ని ఉద్దేశించి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శిం చారు. గవర్నర్లు… కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధు లుగా ఉన్నారన్నారు. రాజా ఆదివారం తమిళనాడు లోని కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు అత్యున్నత పదవులను కట్టబెడుతున్నారన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఏకం కావడం అత్యవసరమని నొక్కిచెప్పారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల అమలుకు కసరత్తు ముమ్మరమవుతోందని అన్నారు. కోయం బత్తూర్‌కు చెందిన బీజేపీ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు సీపీ రాధాకృష్ణన్‌ను జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించడం, గతంలో ఎల్‌.గణేశన్‌, తమిళసై సౌందరరాజన్‌, భగత్‌ సింగ్‌ కోషియారి వంటి బీజేపీ నేతలకూ గవర్నర్‌ పదవులు దక్కడాన్ని ప్రస్తావించారు. ఒక దేశంఒక ఎన్నిక అంటూ రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించాలని, ప్రజాస్వా మ్యాన్ని, లౌకికవాదాన్ని అణచివేయాలని బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తున్నాయన్నారు. దేశంలో ఒకటే పార్టీ పరిపాలన సాగించేలా కసరత్తు జరుగుతోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టినది పేద ప్రజల వ్యతిరేక బడ్జెటని డి.రాజా విమర్శించారు. ఎంఎస్‌ఎంఈలను దెబ్బతీసిందని, ఎంజీఎన్‌ఆర్‌ఈఏజే కేటాయింపులలో కోతల ప్రభావం పేదలపై పడిరదన్నారు. కేవలం కార్పొరేట్ల ఉజ్వల భవిష్యత్‌కే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్‌ రుజువు చేసిందని అన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఏకమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలని రాజా నొక్కిచెప్పారు. వివిధ పార్టీల నేతలకు జాతీయ స్థాయిలో ఆశలు` ఆకాంక్షలు ఉన్న క్రమంలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి సీపీఐ ఎలా తేగలదని ప్రశ్నకు స్పందిస్తూ ‘ప్రతి రాష్ట్రంలో రాజకీయాలు వేర్వేరని రాజా అన్నారు. అందరినీ ఒకవేదికపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు భారత్‌ జోడో యాత్రే ఉదాహరణ అని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు భారత్‌ జోడో యాత్ర చివరి రోజున పాదయాత్రలో రాహుల్‌ గాంధీతో కలిసి నడిచారని, కొందరు వేర్వేరు పనుల వల్ల రాలేకపోయారని అన్నారు. అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ ద్వారానే నిజనిజాలు తేలుతాయని, అందుకే సీపీఐ దానికోసం డిమాండ్‌ చేస్తోందని డి.రాజా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img