Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

సీబీఎస్‌ఈ.. ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సప్రెసింగ్‌ ఎడ్యూకేషన్‌’ : రాహుల్‌గాంధీ

సీబీఎస్‌ఈ 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ సబ్జెక్టుల పలు టాపిక్స్‌ను తొలగించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సీబీఎస్‌ఈని ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సప్రెసింగ్‌ ఎడ్యూకేషన్‌’గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. జాతీయ విధానాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. సీబీఎస్‌ఈ 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ సబ్జెక్టుల నుంచి అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యుద్ధ కాలం, ఆఫ్రో ఆసియా ప్రాంతాల్లో ఇస్లాం రాజ్య విస్తరణ, ముఘల్స్‌ కోర్టులు, పారిశ్రామిక విప్లవం టాపిక్స్‌ను తొలగించింది. అలాగే పదో తరగతి సిలబస్‌ నుంచి ఫుడ్‌ సెక్యూరిటీ చాప్టర్‌లో వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం టాపిక్‌ను తీసివేసింది.సెక్యూలర్‌ స్టేట్‌ సెక్షన్‌లో ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ కవితలను సైతం తొలగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img