Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

2-6 ఏళ్ల వయసు వారికి రెండో డోసు టీకా ట్రయల్స్‌


సన్నద్ధవుతున్న కొవాగ్జిన్‌
కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు. కొవాగ్జిన్‌ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వారిపై పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.6-12 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే రెండో డోసు ఇచ్చినట్లు దిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడిరచాయి.ఔషధ పరీక్షల్లో భాగంగా చిన్నారులను వయసుల వారీగా బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 175 మంది చిన్నారులను ఉంచి వారికి టీకా ఇస్తున్నారు. ఇలా రెండు డోసుల టీకా పొందిన చిన్నారులను పరీక్షిస్తారు. అనంతరం ఆగస్టు చివరికల్లా ఔషధ పరీక్షల మధ్యంతర నివేదిక వచ్చే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img