Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వారసుడొస్తున్నాడు…

మూడో తరం ‘గాంధీ’గా రాహుల్‌ పోటీ
ఈ స్థానంతో విడదీయలేని బంధం
ఇక్కడ నుంచే ఎంపీలైన
ఫిరోజ్‌, ఇందిరా, సోనియా

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. ఈ స్థానంలో గాంధీ కుటుంబానికి అమితాదరణ ఉంటుంది. ఫిరోజ్‌ గాంధీ నుంచి ఇందిరా గాంధీ, సోనియాగాంధీ వరకు ఇదే స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గాంధీ కుటుంబం నుంచి మూడవ తరం నాయకుడిగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో వారసుడు వస్తున్నాడన్న ఆనందం రాయ్‌బరేలీ ప్రజల్లో కనిపించింది. రాహుల్‌ కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాయ్‌బరేలీ నుంచి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ ఆకస్మిక పరిణామం ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేసింది. రాజకీయ వర్గాల్లో పెద్దచర్చకు దారితీసింది. యూపీలోని అమేథి, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్‌ పార్టీ చివరకు సస్పెన్స్‌ కొనసాగించింది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం రాహుల్‌ను బరిలో నిలిపింది. దీంతో రాయ్‌బరేలీ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

గాంధీల వారసత్వ స్థానం
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో, 1957లో జరిగిన తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఫిరోజ్‌ గాంధీ (రాహుల్‌ తాతయ్య) ఎన్నికయ్యారు. 1967 నుంచి 1977 వరకు ఎంపీగా ఉన్నారు. ఫిరోజ్‌ గాంధీ సతీమణి, భారత పూర్వ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980 ఎన్నికలలో రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2004 నుంచి 2019 వరకు నాలుగు సార్లు రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు. వీరికి దగ్గర బంధువులైన అరుణ్‌ నెహ్రూ, శీలా కౌల్‌ కూడా ఈ స్థానానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబానికి పట్టువున్నది. ఇక్కడి ప్రజలకు గాంధీ ఇంటి పేరు అంటే మమకారం ఎక్కువ. కాబట్టి రాహుల్‌ ఓడిపోయే ప్రసక్తి లేదు. 2019లో ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ చిత్తు అయినప్పటికీ రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ి 55.8శాతం ఓట్లతో గెలిచారు.
అమేథిని కాదని రాయ్‌ బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. రాహుల్‌ భయపడిపోయి అమేథి నుంచి పారిపోయారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ వాటిని సమర్ధమంతంగా తిప్పికొడుతోంది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీకి కారణం గాంధీ కుటుంబానికి ఈ స్థానంతో ఉన్న ఆత్మీయబంధమని కాంగ్రెస్‌ చెబుతోంది. ఉత్తర`దక్షిణ భారతం మధ్య సమతుల్యతకూ ఈ స్థానం దోహదమవుతుంది. సోనియాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నందున ఉత్తరంలో అగ్రనాయకుడి ప్రాతినిధ్యం అత్యవసరం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే (కర్నాటక), ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (కేరళ), అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ (కర్నాటక) దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా ఉత్తరాది ఆరు రాష్ట్రాల్లో నేరుగా బీజేపీతో తలపడిరది. అయితే ఆయా రాష్ట్రాల్లో పార్టీ మరింతగా బలపడాల్సిన అవసరమున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచింది కానీ రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ను కోల్పోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. జార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతోంది. వాస్తవానికి అమేథి నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్‌ సీనియర్లు భావించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచార బాధ్యతలను చేపట్టడంతో పోటీ నుంచి ప్రియాంక తప్పుకున్నారు. దీంతో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్‌ శర్మకు అమేథిó టికెట్‌ లభించింది. తొలుత మాజీ ఎంపీ శీలా కౌల్‌ మనుమడిని అమేథి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్‌ యోచించింది. చివరకు శర్మను ఎంపిక చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img