Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అటార్ని జనరల్‌ పదవిని తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అటార్నీ జనరల్‌ పదవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్సీ తిరస్కరించారు.ఈ విషయాన్ని ఆయన ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా రోహత్గీ మరోసారి ఏజీ పదవిని చేపట్టనున్నారని, అక్టోబర్‌ 1న బాధ్యతలు స్వీకరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే తనకు ఆ పదవిపై ఆసక్తి లేదని రోహత్గీ ప్రకటించారు.ప్రస్తుతం అటార్జీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ (91) సేవలు అందిస్తున్నారు. ఆయన పదివీకాలం జూన్‌లో ముగిసిపోయింది. దీంతో మూడు నెలలపాటు వేణుగోపాల్‌ పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. వయో భారం కారణంగా మరోసారి ఆ పదవిలో కొనసాగడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం ముకుల్‌ రోహగ్నీ పేరును ప్రతిపాదించింది. దీనికి ఆయన తిరస్కరించారు. సీనియర్‌ ముకుల్‌ రోహత్గీ 2014 నుంచి 2017 వరకు భారతదేశ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అయితే 2017 జూన్‌లో వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అనేక ప్రధానమైన కేసుల్లో ఆయన సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లో తన వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img