Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఈడీ ముందుకు రాహుల్‌ గాంధీ

దేశవ్యాప్త నిరసనలకు దిగిన కాంగ్రెస్‌
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విచారణకు ఈడీ అధికారులు సోమవారం ప్రశ్నించనున్నారు. తాజాగా ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే తమ అగ్రనేతపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ‘సత్యాగ్రహ’ పేరుతో తలపెట్టిన ఈ ఆందోళనలను ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.ా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే కాంగ్రెస్‌ మాత్రం తన సత్యాగ్రహ యాత్రను కొనసాగిస్తుందని ఆ పార్టీ నేత రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. దిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ మేరకు వెల్లడిరచారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్‌ సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తుందని సుర్జేవాలా వివరించారు. మరోవైపు కొవిడ్‌-19 సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ జూన్‌ 23న ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img