Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం..

వర్షాలు, వరదలకు కూలిన బిల్డింగ్‌..నీట మునిగిన పలు ఇళ్లు
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. పిథోరగఢ్‌, ధార్చుల పట్టణంలో భారీగా నష్టం వాటిల్లింది. భారీ వరదలకు కాలి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదలకు నది తీరం కోతకు గురైంది. దీంతో అంచులో ఉన్న ఒక బిల్డింగ్‌ కూలింది. ఖోటిల గ్రామంలో 50కిపైగా ఇల్లులు నీట మునిగాయి. కాగా, ఉత్తరాఖండ్‌ పోలీస్‌, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. కాలి నది ఉధృతంగా ప్రవహించడంతోపాటు ప్రమాదకర స్థితికి చేరడంపై ప్రజలను హెచ్చరించారు. ఆ నదిపై ఉన్న అన్ని వంతెనల మీదుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. భారీ వరదలకు నది తీరం అంచున ఉన్న ఒక బిల్డింగ్‌ కూలిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. ప్రజలు, పర్యాటకులు సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img