Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఒడిశా పంచాయితీ ఎన్నికల్లో హింస

భువనేశ్వర్‌ : ఒడిశాలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్రంలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. పోలీసుల సమక్షంలోనే అనేక చోట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నాలు జరిగాయి. జైపూర్‌ జిల్లాలోని బచోళ పంచాయితీలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన దుండగులు ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు యత్నించిన నలుగురు జర్నలిస్టులపైనా దాడి చేశారు. ఇదే పంచాయితీలో బ్యాలెట్‌ బాక్సులను అపహరించి సమీపంలోని చెరువులో పడేశారు. కెండ్రపర జిల్లాలోని డేరా పంచాయితీలో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అనేక మందికి గాయాలయ్యాయి. ఒక ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారంనాటి పోలింగ్‌లో 56.53 లక్షల మంది ఓటర్లకు 78.6
శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం సోమవారం తెలిపింది. 63 బ్లాకుల్లోని 171 జిల్లా పరిషత్‌ సభ్యులు, 1382 సర్పంచ్‌ పదవులకు 18495 పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీి) ఆదిత్య ప్రసాద్‌ పాధి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగడంతో కొన్ని చోట్ల ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడిరదని, జిల్లా అధికారుల నుంచి దీనిపై వివరణ కోరామని, నివేదికలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఆదిత్య ప్రసాద్‌ తెలిపారు. తొలి, రెండో విడత ఎన్నికల్లోనూ హింసాకాండ జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే నాలుగవ, చివరి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ దశ పోలింగ్‌లో 51.31 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 163 జిల్లా పరిషత్‌ జోన్లలోని 163 బ్లాక్‌లలోని 1,254 పంచాయితీలకు సంబంధించి 17,089 పోలింగ్‌ కేంద్రాలలో మంగళవారం ఓటింగ్‌ జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img