Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బుహాని కంపెనీలపై ఈడీ చార్జిషీటు

పీఎస్‌యూలకు నాసిరకం బొగ్గు అమ్మకాల ఆరోపణ
రూ.రూ.564.48 కోట్ల ఆస్తులు అటాచ్‌

న్యూదిల్లీ : పీఎస్‌యూ సంస్థలకు నాసిరకం బొగ్గును విక్రయిస్తున్న క్రమంలో మనీలాండరింగ్‌ కేసులో చార్జిషీటును చెన్నై ప్రత్యేక కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం బుహాని కంపెనీలపై దాఖలు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఏఆర్‌ బుహారి ఉండగా ఆయనకు చెందిన ఆరు కంపెనీలు కోస్టల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (చెన్నై), కోస్టల్‌ ఎనర్జెన్‌ ప్రై.లి. (చెన్నై), సీఎన్‌ఓ డీఎంసీసీ దుబాయి, సీఎన్‌ఓ ఎల్‌ఎల్‌ఎల్‌సీ (దుబాయి), ప్రేసియస్‌ ఎనర్జీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌), ముటియారా ఎనర్జీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (మారిషస్‌)పై చార్జిషీటు దాఖలైంది. నాసిరకం బొగ్గును ఎక్కువ ధరకు పీఎస్‌యూలకు విక్రయిస్తూ చేసిన మోసాల గురించి అందులో ఈడీ పేర్కొంది. ఆరు కంపెనీల నిర్వహణ, నియంత్రణ మొత్తం అహ్మద్‌ ఏఆర్‌ బుహానిదేనని, ఆయనే యజమాని అని చార్జిషీటులో తెలిపింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని క్రిమినల్‌ సెక్షన్ల కింద చార్జిషీటు నమోదైంది. సీఈపీఎల్‌ లేదా ఎంఎంటీసీ ద్వారా టెండర్ల ప్రక్రియ సాగిందని, బొగ్గును సీఈపీఎల్‌ నేరుగా సరఫరా చేసేది లేదా ఎంఎంటీసీ ద్వారా నకిలీ సీఓఎస్‌ఏ (సర్టిఫికేట్‌ ఆఫ్‌ సాంపి ్లంగ్‌ అండ్‌ అనాలసిస్‌) మద్దతుతో నాసిరకం సరుకు సరఫరా జరిగేదని ఈడీ వెల్లడిరచింది. బొగ్గు విలుకంటే ఎక్కువ విలువ కట్టిన నేరం కింద రూ.564.48 కోట్ల అక్రమ ఆదాయాన్ని బుహాని ఆర్జీంచినట్లు పేర్కొంది. వేర్వేరు కంపెనీల ద్వారా ఈ అక్రమ దందా సాగినట్లు ఆరోపించింది. ఇంతకుముందు రూ.564.48 కోట్లు విలువ చేసే భూమి, ప్లాంటు, యంత్రాంలతో పాటు కోస్టల్‌ ఎనర్జెన్‌ ప్రై.లిమిటెడ్‌కు సంబంధించిన ఇతర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img