Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

నెల్లూరులో చికెన్‌ కొంటున్నారా అయితే జాగ్రత్త…

విశాలాంధ్ర బ్యూరో`నెల్లూరు : నెల్లూరులో చికెన్‌ కొంటున్నారా అయితే అది నిల్వ వున్నకుళ్ళిన మాంసం అయివుండవచ్చు.నెల్లూరు కొన్ని హోటళ్లలో మాంసాహారం తింటున్నారా అయితే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు ఎలా అంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యర్థాల తో కూడిన కల్తీ మాంసం కలిసి వుండొచ్చు.నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం ప్రాంతం లోని చికెన్‌ దుకాణాల మీద హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణదాడులునిర్వహించారు..ఈ దాడుల్లో వెంకటేశ్వర పురం లోని బిస్మిల్లా చికెన్‌ షాప్‌ లో నిల్వ ఉంచిన 100 కేజీల చికెన్‌ ని సీజ్‌ చేయడం జరిగింది. వినియోగదారులు నుండి ఫిర్యాదు రావడంతో హెల్త్‌ అధికారి వెంకటరమణ చికెన్‌ దుకాణాలు పై దాడులు నిర్వహించారు.నెల్లూరు నగరంలో కొన్ని రోజుల క్రితం చెన్నై నుండికుళ్ళినచికెన్‌ వ్యర్ధాలు వందల కేజీల చికెన్‌ని హోటల్స్‌కు సరఫరా చేయడనికి తీసుకు వస్తుండగా జిల్లా హెల్త్‌ అధికారి సీజ్‌ చేయడం జరిగింది, దీంతో నెల్లూరు నగరం లోని మాంసం ప్రియులుదుకాణాల్లోమాసంకొనాలంటే హడలి పోతున్నారు,నెల్లూరునగర పాలక సంస్థ లోనిహెల్త్‌ఆఫీసర్‌ఇతరఅధికారులు తూతూ మంత్రంగా మాత్రమే తనికీలు నిర్వహిస్తూ వున్నారని అలా కాక నిరంతరాయం గామాసందుకాణాలుతో పాటు ఆహారసంబధిత రంగాల్లో తనికీలు చేపట్టి ప్రజలఆరోగ్యంకాపాడాలనినగర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img