Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌
Visalaandhra Bureo -Nellore: రాష్ట్ర ప్రభుత్వ వెంటనే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది అలాగే ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి శాసన మండల సభ్యులు కూడా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కార దిశ గా పోరాటం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వము ప్రయత్నం చేసి ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ఆటంకంలేకుండాచేయాలి.మెర్జింగ్‌ విధానంలో ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమ రుగాయ్యే ప్రమాదం వుంది కావున మెర్జ్‌ కాని పాఠశాలల ను అలాగే వుంచాలి.ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలను కొనసాగించాలి.ఇప్పుడు వున్న సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలి.
పిఎఫ్‌ మరియు ఏపీ జి ఎల్‌ ఐకి సంబంధించి లోన్లు మరియు సరెండర్‌ లీవ్‌ బిల్లులు సంవత్సరం నుంచి పెండిరగ్లో ఉన్నాయి ఆ బకాయిలు వెంటనే చెల్లించాలి అన్ని హాస్పిటల్లో అన్ని అనారోగ్యాలకు హెల్త్‌ కార్డ్‌ ఉపయోగించు కొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క జీతాలను ఒకటవ తేదీన జమ అయ్యే విధంగా చేయాలి స్కూల్‌ మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ పూర్తిగా వేయాలి .ప్రతి పాఠశాల యొక్క కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి ఏకోపాధ్యాయ పాఠశాలలకు 98 డీఎస్సీ వాళ్లను అలాట్‌ చేయాలి. ప్రాధమిక పాఠశాల లో ఎక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు వుండకుండా చర్యలు చేపట్టాలి.మిడ్‌ డేమీల్స్‌ మీద బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు తప్పించి సచివాలయం సిబ్బందికి ఇవ్వాలి
టాయిలెట్‌ ఫోటోలు నుంచి తప్పించాలి
ఎం ఏ తెలుగు అర్హత కలిగిన వారికి ప్రమోషన్‌ కల్పించాలి విద్యార్ధుల సంఖ్య తక్కువ నెపంతో పాఠశాలల ను ముసివేయరాదు.పైవిషయాలపై ఈ రోజు జరిగిన ఆల్‌ యూనియన్స్‌ మీటింగ్‌ లో ఎ పి ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ తమ డిమాండ్స్‌ ను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లిందని నెల్లూరు జిల్లా అధ్యక్షులుబచ్చుడేవిడ్‌ చిన్నబాబుప్రధానకార్యదర్శికంచర్లమధుసూదనరావుతెలియచేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img