Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

డి.ఈ సుధాకర్ కు కార్పొరేషన్ నివాళి

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) : నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న డిఇ సుధాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. డేవిడ్ సుధాకర్ కు కమిషనర్ హరిత, సిబ్బంది నివాళులు అర్పించారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నగర పాలక సంస్థకు డి.ఈ హోదాలో డేవిడ్ సుధాకర్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img