Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భవిత కేంద్రాన్ని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్

రికార్డులను పరిశీలిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్వి

విశాలాంధ్ర – బుచ్చిరెడ్డిపాలెం: బుచ్చిరెడ్డిపాలెం లోని భవిత కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ విద్యాదరి సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారు? ప్రతి వారం ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారా, లేదా? తదితర అంశాలపై అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉపారాణినీ అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి సంబంధించిన అన్ని రికార్డులనూ పరిశీలించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలూ అందించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు ఆమెను మరుగుదొడ్ల సౌకర్యం లేదు అని అడిగారు.అంతేకాకుండా స్పీచ్ తెరపిస్ట్ ను ఏర్పాటు చెయ్యాలని అసిస్టెంట్ కలెక్టర్ నీ సిబ్బంది కోరడం జరిగింది.దీనిపై ఆమె స్పందిస్తూ సంభందిత అధికారులకు సమాచారం అదించి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.వీరి వెంట ఐ కోఆర్డినేటర్ ధనమ్మ, మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img