Friday, October 25, 2024
Friday, October 25, 2024

రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి… అనే నినాదంతో సిపిఐ బస్సు యాత్ర

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు : రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిమాజీ శాసనసభ్యులు కే రామకృష్ణనాయకత్వంలోబస్సుయాత్రచేపట్టడం జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నెల్లూరు జిల్లా ఇంచార్జ్ డి జగదీష్ అన్నారు. సోమవారం నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1952 నుండి 2019 వరకు రాష్ట్రంలోని ముఖ్యమంత్రిలు1,50,000 అప్పు చేస్తే 2019 నుండి2023 వరకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఇంత అప్పు చేసి కూడా ఏమి సాధించారంటే అంతా శూన్యం తప్ప మరేమీ లేదని జగదీష్ ఆవేదన చెందారు రాష్ట్రంలో నిరుద్యోగం 27 శాతానికి పెరిగిందని, అలాగే ఉన్న పరిశ్రమలు ప్రక్క రాష్ట్రంలైన తమిళనాడు తెలంగాణలకు తరలిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో నాడు 151 యొక్క అసెంబ్లీ స్థానాలు,22 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి అధికారం అందించారు కానీ ఆయన రాష్ట్రానికి ఏమి చేశారు కేంద్రాల్లోని బిజెపికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరేమైనా అభివృద్ధి చేసేవా జగన్మోహన్ రెడ్డి అని జగదీష్ ప్రశ్నించారు కేంద్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులు 7 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా రాష్ట్రానికిఎంతోప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాను కల్పించలేకపోవడంకాక ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయటానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చటంలో పూర్తిగా విఫలమైనారని ఆయన ఆరోపించారు.ఎన్నికల ముందు తను చేసినటువంటి పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ఎన్నో ప్రగల్పాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుండి నేటి వరకు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాక ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడమే కాక చెత్త పై పన్ను పేరుతో సామాన్య ప్రజలను దూసుకు తింటున్నారని ఆయన ఆరోపించారు అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ పై ఉన్న పన్ను కంటే రాష్ట్రంలో అత్యధికంగా వసూలు చేస్తున్నావు. ఈ విధంగా నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష రాజకీయ నాయకుల పై అక్రమంగా కేసులు బలాయించడం హౌస్ అరెస్టు చేయడం పోలీసులు చేత కేసులు పెట్టి బెదిరించడం తప్ప మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని జగదీష్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నీవు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటినుండి ఏరోజైనా ప్రతిపక్ష నాయకులు లేదా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు కనీసం నీకు వినతి పత్రానికి ఇవ్వడానికి అవకాశం కల్పించిన దాఖలు ఉందా ప్రతిపక్షాలకే కాదు నీ పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు ఎవరైనా నేరుగా వారు ఏ విధమైన నిర్ణయం తీసుకునే అధికారం లేదు కేవలం ముఖ్యమంత్రి చెప్పింది తప్ప మరే విషయం కూడా మాట్లాడేందుకు నీ పాలనలో ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి పరిస్థితి ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూద్దామంటే గతంలో 14 మంది ప్రధాన మంత్రులుగా దేశాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి పాలన సాగించారు కానీ నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తల అభివృద్ధి తప్ప దేశ అభివృద్ధి లేదని పైగా దేశంలోని లౌకిక వాదాన్ని పూర్తిగా అణచివేసి మను సిద్ధాంతాన్ని మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యపరంగా పాలన లేదు కనుక సిపిఐ ఆధ్వర్యంలో దేశాన్ని రక్షించండి రాష్ట్రాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రజలలోకి వెళ్లడానికి ఈ బస్సు యాత్రను చేపట్టడం జరిగిందని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర కంటే ముందుగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు నిర్వహించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు భారత్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అన్ని వర్గాల పార్టీలు ప్రజలతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పూల సుబ్బయ్య, వెలుగొండ ప్రాజెక్టులన విషయంపై కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పోరాటం చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుందని అదేవిధంగా,జిల్లాలోనిపలు సమస్యలపైతగినపోరాటంచేసేందుకుఒక కార్యాచరణప్రణాళికరూపొందించుకొని ముందుకుపోవడంజరుగుతుందని చెప్పారుఈసమావేశంలోజిల్లాకార్యవర్గసభ్యులుఅరిగెలనాగేంద్ర సాయి, షేక్ సిరాజ్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img