Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఎంపీపీ ఆకస్మిక పర్యటన

విశాలాంధ్ర – గుడ్లూరు: మండలంలోని బసిరెడ్డిపాలెం పంచాయితీ పరిధిలో గల పలు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను , సబ్ హెల్త్ సెంటర్ ను స్థానిక ఎంపీపీ పులి రమేష్ శుక్రవారం ఆకస్మిక పర్యటన ద్వారా తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా ఎంపీపీ తొలుత బసిరెడ్డిపాలెంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి , అక్కడ జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయించాలని, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు సలీంభాషాకు సూచించారు. అనంతరం స్థానిక పీ.హెచ్.సీ సబ్ సెంటర్ ను తనికీ చేసి, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి ఆరా తీశారు. పంచాయితీ పరిధిలో బసిరెడ్డిపాలెం, చెంచిరెడ్డిపాలెం లో గల అంగన్వాడీ సెంటర్లను, ఎస్.సి కాలనీలో గల ప్రాధమిక పాఠశాలలో గల పలు రిజిస్టర్లు , హాజరు పట్టీలు, స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి, స్టాకును తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరు విధినిర్వహణలో సమయ పాలన పాటించాలని, చిన్నారులకు, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, హెల్త్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img