Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

సి.ఐ గా భాద్యతలు స్వీకరించిన సుబ్బారావు

విశాలాంధ్ర – గుడ్లూరు: గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న గుడ్లూరు పోలీస్ స్టేషన్, జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలి వెళ్ళింది. దీనితో గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాలకు ప్రత్యేక సర్కిల్ ఆఫీస్ ను గుడ్లూరుకు కేటాయించారు. దీనికి ప్రధమ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పీ.సుబ్బారావు ను నియమించగా, శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది తమ నూతన సి.ఐ కు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. సి.ఐ సుబ్బారావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరి రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని , శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సమస్యలు ఎక్కడ ఉత్పన్నమైనా ఉపేక్షించేది లేదని , అటువంటి వాటిని తనకు ఎప్పుడైనా తెలియపరచ వచ్చునని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ముఖ్యంగా కోళ్ల పందాలు, ఇసుక అక్రమ రవాణా, పేకాట, రేషన్ బియ్యం, అక్రమ మద్యం విక్రయాలు, విచ్చల విడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినదని, వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది భాస్కర్ రావు, రెహమాన్, రమేష్, ప్రదీప్, జాలయ్య, హరికృష్ణ, ప్రసాద్, హరి ఇతర సిబ్బంది ఉన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img