Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘అభివృద్ధికి వైసిపి నాయకులే అడ్డుకట్ట’ వార్తా కథనానికి స్పందించిన అధికారులు

ఈ నెల రెండవ తేది “అభివృద్ధికి వైసిపి నాయకులే అడ్డుకట్ట” అనే వార్తా కధానికి అధికారులు, నాయకులు స్పందించారు. దీంతో అధికారులు, నాయకులు సోమవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా యంత్రాల సాయంతో భూమిని చదును చేసి రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వంటి భవనాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి కొత్తూరు వైసిపి నాయకులు కైలాసం శ్రీనివాస్ రెడ్డి వెంకు రెడ్డి ఈదురు విజయభాస్కర్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి అల్తూరి వెంక రెడ్డి అధికారులు పంచాయతీరాజ్ ఎ ఇ ఖాదర్‌ మస్తాన్ పంచాయతీ కార్యదర్శి పద్మజ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాదని మస్తాన్ మాట్లాడుతూ కేంద్రాలను నిర్మిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img