Friday, April 26, 2024
Friday, April 26, 2024

30 శాతం రాయతీపైన మినుము విత్తనాల కు రిజిస్ట్రేషన్ చేసుకోండి

వ్యవసాయఅధికారి హేమంత్ భరత్ కుమార్

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లో లోని రైతు భరోసా కి అర్హత ఉన్న యస్సీ యస్టీ మరియు బీసీ కౌలు రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవలసినదిగా మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ తెలియజేశారు.
గ్రామ రెవెన్యూ అధికారులు దగ్గర సిసిఆర్సీ కార్డు పొంది వున కౌలు రైతులు ఈ ఖరీఫ్ సీజన్ 2022 పంట వేసి ఉన్న కౌలు రైతులు మీ గ్రామ సచివాలయం పరిధిలోని రైతు భరోసా కేంద్రం లోని వ్యవసాయ సహాయకులు సంప్రదించి కౌలు రైతు దరఖాస్తు పత్రము మరియు గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర పొందిన సిసిఆర్సీకార్డు నకలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా తెలియజేయడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్ 2022 కి పంట వేసిన యస్ సీ, యస్టీ మరియు బీసీ కౌలు రైతులు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం సిసిఆర్సీకార్డు పొందిన కౌలు రైతులకు మాత్రమే పంట నమోదు చేయబడును కనుక పొలం కౌలుకు తీసుకున్న కౌలు రైతులందరూ గ్రామ రెవెన్యూ అధికారులు సంప్రదించి సీసీఆర్సీ కార్డు పొందవలసినదిగా రైతులకు సూచించారు
30% రాయితీపైన కందులు మరియు మినుము విత్తనాలు రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు నకలు మరియు మొబైల్ ఫోన్ తీసుకొని రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు, కందులు పూర్తి ధర క్వింటా రూపాయలు 10,000 రూపాయలు రైతులు చెల్లించవలసినది క్వింటాకు 7,000రూపాయలు మినుములు పూర్తి ధర 11,350రూపాయలు రైతు చెల్లించాలని అన్నారు క్వింటాకు 7945 రూపాయలచెల్లించబడుతాయని మండల వ్యవసాయాధికారిహేమంత్ భరత్ కుమార్ రైతులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img