Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కల్వర్టును ఢీకొని పల్టీ కొట్టిన కారు

  • డ్రైవర్ నిద్రమత్తే కారణం
  • పలువురికి గాయాలు
  • వెంటనే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది
  • క్షతగాత్రులను 108లో కావలి వైద్యాశాలకు తరలింపు

విశాలాంధ్ర – గుడ్లూరు :- మండలం పరిధిలో గల మోచర్ల – వీరేపల్లి 16వ నెంబర్ జాతీయ రహదారిపై వీరేపల్లి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని అనంతరం పల్టీ కొట్టి పలువురికి గాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం రాజమండ్రి ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, యజమాని, డ్రైవరుతో కలిపి మొత్తం 8 మంది తిరుపతి దర్శనమునకు వెళ్లి రాజమండ్రి కి తిరిగి వెళుతుండగా వేకువజామున వీరేపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్ కారు నడుపుచూ నిద్రమత్తులోకి జారుకున్నారు. దీనితో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని తిరగపడినది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అందరికి దాదాపు గాయాలు తగిలాయి. రహదారిన ప్రయాణిస్తున్న వ్యక్తులు కారులో నుండి వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ హైవే సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని, 108 కు సమాచారం చేరవేశారు. 108 సిబ్బంది వారికి ప్రధమ చికిత్స నిర్వహించి, క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. అందరికి చికిత్సలు నిర్వహించారు. అనంతరం ఇద్దరి మహిళలను మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img