Friday, June 14, 2024
Friday, June 14, 2024

కేజ్రీవాల్‌ బెయిల్‌తోబీజేపీ వ్యూహాలు ఔట్‌

సుశీల్‌ కుట్టి

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీహార్‌ జైలునుంచి తాత్కాలిక బెయిల్‌పై బైటకురావడంతో దిల్లీలో బీజేపీవేసుకున్న వ్యూహాలు, ఎత్తుగడలు, చెల్లాచెదు రయ్యాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అందరికీ దగ్గరైన వ్యక్తి. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ శిశోడియా లేదా మాజీ జైళ్ల మంత్రి సత్యేంద్ర జైన్‌ కూడా తీహార్‌ జైల్లో చాలాకాలం నుంచి మగ్గు తున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడిరచేందుకు ఇండియాకూటమిలో భాగమైన కేజ్రీవాల్‌ ప్రముఖస్థానం కలిగిఉన్నారు. కొత్తకొత్త వ్యూహాలు రూపొందించ డంలో కేజ్రీవాల్‌ నిపుణుడు. కేజ్రీవాల్‌ అత్యంత ఎక్కువ కాలం గడవ కుండానే తాత్కాలిక బెయిల్‌ను పొందగలిగారు. సుప్రీంకోర్టు సైతం కేజ్రీవాల్‌ అరెస్టు సరైందికాదన్న బావనతో తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేశారని భావిస్తున్నారు. కొంతమంది రాజకీయ ధృక్కోణంతో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని అంటున్నారు. కేజ్రీవాల్‌ 21రోజులు జైలులో ఉన్నారు. అక్కడినుంచే రాష్ట్రపతి పాలన సాగించారు. అయితే బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు రాష్ట్ర సచివాలయానికి వెళ్లకూడదన్న షరతు కోర్టు విధించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కేజ్రీవాల్‌కు లభించింది. ఆయన బైటకు రావడమే ప్రజలకుసైతం పెద్ద ఊరట కలిగిం చింది. దిల్లీలో నీటి కొరత తదితర సమస్యలను పరిష్కరించేందుకు కేజ్రీవాల్‌ వేగంగా చర్యలు తీసుకోగలడన్న నమ్మకం ప్రజలలో ఉంది. కేజ్రీవాల్‌ను అక్రమంగా జైలుకు పంపారన్న అభిప్రాయం కూడా ప్రజలలో గణనీయంగా ఉంది.ఆయన జైల ునుంచి విడుదలకాగానే అత్యంత వేగంగా బైటకువచ్చి పరుగెత్తినట్లుగా చకచకా నడుచుకుంటూ వచ్చారు. కన్నాట్‌ ప్లేస్‌ హనుమాన్‌ ఆలయం వద్ద శనివారం ఆప్‌ కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. కేజ్రీవాల్‌ తరచుగా హనుమంతుడిని తలచుకోవటం రాజకీయ లబ్దికోసమే ననేది ప్రజలలో ఉన్న అభిప్రాయం. కేజ్రీవాల్‌ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయులలో ఒకరని కొందరు భావిస్తే, రాజకీయ ప్రత్యర్థులు అయనను మోసకారిగా ఆరోపిస్తున్నారు. ఆయన జైలు నుంచి బైటకురాగానే నియంతృత్వం నుండి దేశాన్ని కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్‌ జైలుకు తిరిగి జూన్‌ 2వ తేదీన వెళ్లవలసిఉంటుంది. దిల్లీలో అత్యంత చాకచక్యం కలిగిన ప్రజాదరణ కలిగిన నాయకుడు కేజ్రీవాల్‌ లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే తిరిగి జైలుకు వెళ్లవలసిఉంది. బెయిల్‌ మరో రెండు రోజులు పొడిగించాలని కోరినప్పటికీ, కోర్టు ధర్మాసం అంగీకరించలేదు. ఆయన జైలు గదిలో ఏర్పాటుచేసిన టీవీని వీక్షించి ఫలితాలు తెలుసు కోవలసిందే. ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌ ఇండియా కూటమి గెలుపుకోసం కృషిచేస్తున్నారు. ఇండియా కూటమిలో కేజ్రీవాల్‌ కీలకమైన నాయకుడు. దిల్లీ కాకుండా పంజాబ్‌లో కూడా ఆప్‌ ప్రభుత్వాలున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలకు కూడా ఆప్‌ విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ కేజ్రీవాల్‌ను మరింత విస్తరించకుండా చూడాలనే కుట్రతోనే ఆయనను అరెస్టు చేయించిందని విశ్లేషిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికైనా భయపడుతున్నారనుకుంటే కేజ్రీవాల్‌ దూకుడునుచూసే ఆయన భయపడుతున్నారు. సోషల్‌మీడియాలో మోదీతో గట్టిగా తలపడేవ్యక్తి కేజ్రీవాల్‌ అనే సుప్రీంకోర్టు కూడా గమనించినట్లుంది.
కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చినప్పటికీ ఆంక్షలుపెట్టడం ఆయనను శిక్షించినట్లేనని దిల్లీ ప్రజలు భావిస్తున్నారు. 21రోజులు జైలులో ఉన్నప్పటికీ ఆయన పరోక్షంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన ప్రత్యేకత ఇక్కడే తెలుస్తుంది. అక్రమంగా తనపైన ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసిందని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్‌ను జైలునుంచి విడుదలచేయడం పెద్ద ఊరటఅని మరోవైపు అభిమానులు భావిస్తున్నారు. ఆయన విడుదలకోసం మూడు వారాలుగా ఎదురు చూస్తున్నారు. జాతీయమీడియా అలాగే దేశవ్యాప్త్తంగా ఉన్న మద్దతుదారులు ఆయన విడుదలను స్వాగతించారు. నియంతృత్వాన్ని ఓడిరచండి అని తాజాగా నిలదీస్తున్నారు. నాలుగోదశ ఎన్నికలు మే 13వ తేదీన జరుగనున్నాయి. సమయానికి కేజ్రీవాల్‌ తాత్కాలిక బెయిల్‌ ఆయనకు ఎంతో ఉపయోగపడుతుంది. కేజ్రీవాల్‌ ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అయితే మోదీ మాదిరికాకుండా తనను పరీక్షించడానికి వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ఏమీ వెనుకాడడు. ఆయన బైటకు వెళ్లినతర్వాత ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి అనేది నిర్ణయించు కున్నారు. దిల్లీ ముఖ్యమంత్రిగా కాకుండా, ఆప్‌ కన్వీనర్‌గా నియమ నిబంధనలను సైతం లెక్కచేయకుండా తిరగగలిగే శక్తి ఉన్నవాడు. మే 25వ తేదీన దిల్లీలో ఉన్న ఏడు పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దిల్లీలోని 7 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. ఈ సారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆప్‌ 4సీట్లకు, కాంగ్రెస్‌ 3సీట్లకు కలిసి పోటీ చేస్తున్నాయి. తాము 400సీట్లు గెలుచుకోగలమని మోదీ గతంలో ప్రచారం చేసినట్లుగా ఇప్పుడు అంతగా ఈ మాట వాడటంలేదు. ప్రస్తుత వాతావరణాన్ని చూసి ప్రతిపక్షాలపైన ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. ‘‘వాస్తవానికి ఇబ్బందులు కలగవచ్చు, అయితే ఓటమి ఉండదు. ఈ నిర్ణయాన్ని గౌరవనీయమైన సుప్రీంకోర్టు కూడా స్వాగతించింది. నియంతృత్వం అంతమవుతుంది. సత్యమేవ జయతే అని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ అన్నారు. ఆయనకూడా ఇటీవల జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఇదికూడా రెగ్యులర్‌గా ఇచ్చే బెయిల్‌కాదు. తాత్కాలిక బెయిలే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img