London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

కొరవడిన అభివృద్ధి స్ఫూర్తి

కె. రవీంద్రన్‌

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024`25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి పెట్టినట్టుగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన రాజకీయ పార్టీలను సంతృప్తిపరచేలా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలలో రాజకీయ అవసరాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకవిధంగా ఇది రాజకీయ బడ్జెట్‌ అనడంలో ఎటువంటి అనుమానంలేదు. ఆర్థిక వనరులకంటే రాజకీయ అవసరాలు ముఖ్యమైనవిగా ఈ బడ్జెట్‌ ఉంది. ఈ బడ్జెట్‌ ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఆర్థికమంత్రి భావించకపోవడం దారుణం. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నేపథó్యంలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రతిపాదనలలో ఈ అంశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజీపడిపోవడం, సర్దుబాటు చేసుకోవడం లాంటి అంశాలు ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలలో ప్రధానంగా ఉన్నాయి. సూత్రీకరణలకంటే ఆదేశించిన విధానానికి సంబంధించిన అంశాలు అనేకం ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు ఈ బడ్జెట్‌లో అసలు కనిపించడంలేదు. మిత్రపక్షాలను ఇబ్బందిపెట్టకుండా సమతూకంగా ఆర్థిక సుస్థిరతకంటే ప్రభుత్వంలో భాగస్వాములను సంతృప్తి పరచేందుకే అన్నట్టుగా బడ్జెట్‌పత్రం రూపొందింది.
సమకాలీన భారతదేశంలో సంకీర్ణప్రభుత్వ పాలనలో అనేక తికమకలకు ఈ బడ్జెట్‌ నిదర్శనంగా ఉంది. ఉద్యోగాల కల్పనపై నిర్మలా సీతారామన్‌ అరచేతిలో వైకుంఠం చూపించారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనేక పరాభవాలు ఎదురుకావడంతో వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ రూపొందించారు. ఉద్యోగాల కల్పనకు కచ్చితంగా తీసుకునే చర్యలకు సంబంధించిన ప్రణాళిక ఈ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించడంలేదు. ఉద్యోగాల లేమి, అతి తక్కువ ఉద్యోగాలు ఉండటంతో పదుల లక్షల సంఖ్యలో యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.
పూర్తిగా ఆర్థిక రంగానికి ప్రాముఖ్యతను ఇవ్వడానికి బదులుగా రాజకీయ అంశాలకు ఈ బడ్జెట్‌ ప్రాధాన్యతనిచ్చింది. ప్రాంతీయ పార్టీలను బుజ్జగించవలసిన అవసరాన్ని అనుసరించి ద్రవ్య ప్రాధాన్యతలను నిర్థారించారు. మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడంతో అధికారంపైన బీజేపీ గట్టిపట్టు సాధించేందుకు ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలలో ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్‌ తయారీకి నిశితంగా చర్చలు జరిపారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆర్థిక డిమాండ్లను పరిష్కరించడానికి కొన్ని వ్యూహాత్మకమైన తప్పనిసరి చర్యలను తీసుకోవలసి ఉంటుంది. తప్పనిసరైన రాజకీయ అవసరాలు నిర్మలమ్మ బడ్జెట్‌లో అధికంగా కనిపించాయి. అంతర్గతంగా వైరుధ్యాలు కనిపిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు బడ్జెట్‌లో మనకు అసలు కనిపించవు. సామాన్యులు నిత్యం వాడుకుంటున్న వస్తువులు, ఆహారధాన్యాలు, పప్పు ధాన్యాలు తదితర అనేకం ధరలు రోజురోజుకూ పెరిగి కష్టాలపాలవుతున్నారు. ఈ పరిస్థితి దశాబ్దికాలంగా కొనసాగుతున్నది. ఈ అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదు.
రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలు బడ్జెట్‌లో లేవు. పరిమిత కాల రాజకీయ తప్పనిసరి అవసరాలు, సుస్థిర ఆర్థిక డిమాండ్ల మధ్య ఉద్రిక్తతలు ఉంటాయి. ద్రవ్య వివేకమైన అంశాలపైనే ప్రభుత్వ విశ్వసనీయత ఉంటుంది. అయితే ఇందులో ఈ విశ్వసనీయత దెబ్బతింటుందని భావించవలసిన అవసరం ఉంది. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అత్యంత తీవ్రమైన విమర్శలు, అసంతృప్తులు ఉంటాయి. ప్రత్యేకించి బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరిగాయనీ, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వెలువెత్తాయి. సమాఖ్యవ్యవస్థ విలువలను సంకీర్ణ ప్రభుత్వం దాదాపుగా పట్టించుకోవడంలేదు. వనరులను అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీచేసే ద్రవ్యపరమైన అంశాలు కనిపించవు. ఉదాహరణకు కేరళ, తమిళనాడు, కర్నాటకకు సంబంధించిన ప్రముఖమైన అంశాలను లేదా గణనీయమైన కేటాయింపులు బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకు అర్థవంతమైన కేటాయింపులు కనిపించవు. దేశ రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య సూత్రాలకు ప్రభుత్వం దూరమైపోయిందని ప్రతిపక్షపార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు విమర్శిస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆలకించడంలేదు. చారిత్రకంగా రాజకీయ పార్టీల అనుబంధాలతో నిమిత్తంలేకుండా విభిన్నరాష్ట్రాల ప్రాధాన్యతలను, ద్రవ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యంగా దేశ బడ్జెట్‌కు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తూ వస్తున్నారు. సహకార ఫెడరల్‌ సూత్రీకరణకు కట్టుబడి పరిపాలన సాగాలి. అయితే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ఆ విధంగాలేదు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలను శాంతింపచేసేందుకే ఆర్థికమంత్రి ప్రాధాన్యతనిచ్చారు.
ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో అతితక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ద్రవ్య నిర్లక్ష్యంకంటే ఇది ఎక్కువ అని చెప్పాలి. సమాఖ్య వ్యవస్థలో విభిన్న ఆర్థిక తప్పనిసరి అవసరాలు ఉంటాయి. వీటిపట్ల బడ్జెట్‌లో ఏమాత్రం అనుకూలత చూపలేదు. కేరళ, తమిళనాడు అత్యధిక ఆర్థిక సహకారం, విశిష్ట అభివృద్ధి, సవాళ్లు తదితర అంశాలను ద్రవ్యపరమైన చర్చల నుంచి మినహాయించారు. తమిళనాడు దీర్ఘకాలంగా పారిశ్రామికంగా విస్తరించిన రాష్ట్రం. భారత్‌ జీడీపీకి ఈ రాష్ట్రం గణనీయంగా నిధులను సమకూరుస్తున్నది. అయినప్పటికీ ఈ రాష్ట్రానికి కేటాయింపులలో నిర్లక్ష్యం వహించింది. ఈ రాష్ట్రం ఆసక్తి చూపిస్తున్న అభివృద్ది, ఆకాంక్షలు, ప్రత్యేకించి ఉత్పత్తి, వ్యవసాయం, పట్టణ మౌలిక సదుపాయాలు లాంటి అంశాలను అసలు పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలకు రాజకీయ సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలను సృష్టించడానికి పెట్టుబడులు ఉండటంలేదు. దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకంటే తాత్కాలిక, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతినిస్తూ నిర్లక్షపూరిత ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ వ్యూహంలో కేవలం ద్రవ్య కేటాయింపుల కంటే ఇతర అనేక పరిణామాలు ఉంటాయి. ప్రతిపక్ష రాష్ట్రాలపై నిర్లక్ష్యం, మరింతగా బెదిరింపులు కొనసాగుతాయి. ప్రాంతీయ ఇబ్బందులు అత్యధికంగా ఉంటాయి. భారత్‌ అభివృద్ధికి అవసరమైన స్పూర్తి గణనీయంగా తరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img