Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

క్యూబా పరిణామాలపై తప్పుదారి పట్టించిన మీడియా!

ఎం.కె.

విపరీత చర్య ఏమంటే రాజధాని హవానాలో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన చిత్రాన్ని వ్యతిరేకుల ఆందోళనగా పశ్చిమ దేశాల కార్పొరేట్‌ మీడియా, వార్తా సంస్థలు చిత్రించగా, దాన్ని గుడ్డిగా ప్రపంచ వ్యాపితంగా మీడియా చిలవలు పలవలుగా వార్తలను ఇచ్చింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరసన కారులకు మద్దతు ప్రకటించాడు. అమెరికాలో వర్షం పడితే తమ దేశాలలో గొడుగులు పట్టే మరో ఇరవై దేశాలు యుగళ గీతాలాపన చేశాయి. వారంతా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు అన్నది స్పష్టం. మరోవైపున నిరసన కారులకు ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.

క్యూబాలో ఏం జరుగుతోంది ? మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా? జులై రెండవ వారంలో అక్కడ జరిగిన ప్రదర్శనల పర్యవసానాలు ఏమిటి ? చిన్న దేశమైనా పెద్ద సందేశం ఇచ్చిన క్యూబా గురించిన వార్తలు వామపక్ష శక్తులకే కాదు, యావత్‌ ప్రపంచానికి ఆసక్తి కలిగించేవే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణ ప్రాంతం, క్యూబా దీవి మధ్య దూరం కేవలం 140 కిలోమీటర్లు మాత్రమే. అంత దగ్గరలో ఉండి 1959 నుంచి అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఉండటానికి క్యూబన్లకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఆసక్తికరం. తాజా పరిణామాలను చూసి క్యూబా సోషలిస్టు వ్యవస్థను కూలదోస్తామని చెబుతున్నవారు కొందరు, కమ్యూనిస్టు పార్టీ అంతానికి ఆరంభం అని వెలువడుతున్న విశ్లేషణలు కొన్ని. తమ వ్యవస్థ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం అని హెచ్చరిస్తున్న క్యూబన్లు. ఆరు దశాబ్దాలుగా అమెరికా అష్టదిగ్బంధనంలో ఉన్న తమను ఇంతకంటే చేసేదేమీ లేదన్న తెగింపు. ప్రపంచంలో మానవత్వాన్ని అమెరికన్లు ఇంకా పూర్తిగా అంతం చేయలేదు, వారెన్ని ఆంక్షలు పెట్టినా మరేం చేసినా మా శక్తికొద్దీ ఆదుకుంటామని క్యూబన్లకు బాసటగా నిలుస్తున్న దేశాలు మరోవైపు.
జులై రెండవ వారంలో అక్కడి సోషలిస్టు వ్యవస్థను ఎలాగైనా సరే కూలదోయాలని చూస్తున్న శక్తుల ప్రేరేపితంతో నిరసన ప్రదర్శన ఒకటి, ఆ కుట్రను వమ్ముచేసి దాన్ని కాపాడాకోవాలనే పట్టుదలతో మరొక ప్రదర్శన జరిగింది. ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన కొందరి ప్రదర్శనలకు వచ్చిన ప్రచారంతో పోలిస్తే ప్రభుత్వ అనుకూల ప్రదర్శనల గురించి దాదాపు రాలేదనే చెప్పాలి. విపరీత చర్య ఏమంటే రాజధాని హవానాలో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన చిత్రాన్ని వ్యతిరేకుల ఆందోళనగా పశ్చిమ దేశాల కార్పొరేట్‌ మీడియా, వార్తా సంస్థలు చిత్రించగా, దాన్ని గుడ్డిగా ప్రపంచ వ్యాపితంగా మీడియా చిలవలు పలవలుగా వార్తలను ఇచ్చింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరసన కారులకు మద్దతు ప్రకటించాడు. అమెరికాలో వర్షం పడితే తమ దేశాలలో గొడుగులు పట్టే మరో ఇరవై దేశాలు యుగళ గీతాలాపన చేశాయి. వారంతా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు అన్నది స్పష్టం. మరోవైపున నిరసనకారులకు ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల తరవాత క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. వాటిలో హవానా ప్రదర్శన చిత్రాన్ని ప్రభుత్వ వ్యతిరేకమైనదిగా పశ్చిమ దేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్దలు పేర్కొన్నాయి. ఏపి వార్తా సంస్థ ఈ తప్పుడు చర్యకు పాల్పడిరది. అయితే ప్రదర్శనలో ఉన్న బ్యానర్లపై ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన సాగిన జులై 26 ఉద్యమం, తదితర నినాదాలు ప్రభుత్వ అనుకూలమైనవిగా ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు జర్నలిస్టులు ఆ చిత్ర బండారాన్ని బయట పెట్టారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌, వాషింగ్టన్‌ టైమ్స్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలన్నీ చిత్రాన్ని అదే విధంగా వర్ణించాయి. ప్రపంచ వ్యాపితంగా ఈ చిత్రం వైరల్‌ అయింది. దాని ప్రాతిపదికన అనేక మంది విశ్లేషణలు కూడా రాశారు. వాటిలో వెంటనే ఒక్క గార్డియన్‌ మాత్రమే తప్పు జరిగినట్లు అంగీకరిస్తూ సవరణ వేసింది. తమకు వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారమే తప్పుడు వార్తల ప్రచారం జరిగినట్లు క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత రోగెలియో పోలాంకో చెప్పారు. గతంలో అనేక చోట్ల రంగు విప్లవాల మాదిరి సామాజిక మాధ్యమాల్లో తిరుగుబాటు యత్నంగా చిత్రించారన్నారు.
క్యూబాలో ఎవరిని గద్దెమీద కూర్చోబెట్టాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది అక్కడి జనం. అక్కడి జనానికి ఆహారం లేదు, ఔషధాలు లేవు, అన్నింటికీ మించి స్వేచ్ఛ లేదు, అందువలన వారికి మద్దతు ఇస్తున్నామని అధ్యక్షుడు జోబైడెన్‌ నమ్మబలుకుతున్నాడు. ఇలాంటి ప్రచారం కొత్తది కాదు బైడెన్‌ ఆద్యుడు కాదు. తాజాగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతు ఇవ్వటం ఐక్యరాజ్యసమితి నిబంధనల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.
అనేక చిన్నదేశాల మీద అమెరికన్లు పెద్ద ఆయుధాలు ఉపయోగించి చివరికి పరువు పోగొట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది. దానికి క్యూబాయే నాంది పలికింది. కూతవేటు దూరంలో ఉన్న క్యూబా మీద బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కిరాయి మూకలను దింపి అమెరికా చేతులు కాల్పుకుంది. మరింత పరువు పోతుందనే భయం కారణంగానే యుద్ధానికి దిగలేదు గానీ అంత కంటే భయంకరమైన ఆర్ధిక దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నారు. బరాక్‌ ఒబామా అయినా డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా కుడి ఎడమల తేడా తప్ప ఎవరూ తక్కువ తినలేదు. ఒబామా హయాంలో ఆంక్షలను పరిమితంగా సడలించారు. అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చూస్తే చరిత్ర పునరావృతం అవుతోందన్నది స్పష్టం. అయినా క్యూబన్లు లొంగలేదు. నియంత బాటిస్టాకే సలాం గొట్టని వారు అమెరికాకు సలాం కొడతారా ?
క్యూబాకు జులై 26 ఒక స్ఫూర్తి దినం. 1953లో బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రోనాయకత్వాన తిరుగుబాటును ప్రారంభించినరోజు. ఆరు సంవత్సరాల తరవాత 1959లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా గతంలో మాదిరి పెద్ద సభలు, ప్రదర్శనల వంటివి జరపలేదు. అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌తో సహా అందరూ పిల్లలతో కలసి దేశ వ్యాపితంగా లెట్యూస్‌ అని పిలిచే ఒక ఆకు కూర మొక్కలనునాటే కార్యక్రమం చేపట్టారు. క్యూబా ఎదుర్కొంటున్న సమస్యల తీరుతెన్నులను తెలుసు కొనేందుకు ఈ ఒక్క ఉదాహరణచాలు. క్యూబా కంటే అనేక పెద్ద దేశాలు, ఆర్థికంగా బలమైనవి ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ల తయారీకి పూనుకోలేదు. అలాంటిది నిధులకు కటకటగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తాన్ని వెచ్చించి కరోనా వైరస్‌ నివారణకు వారు ఐదు వాక్సిన్లను రూపొందిస్తున్నారు. అయితే తయారు చేసిన వాటిని తరలించేందుకు అవసరమైన వాహనాలు నడిపేందుకు అవసరమైన డీజిలు, పెట్రోలు, వాక్సిన్లు నింపేందుకు అవసరమైన ప్రత్యేక సీసాలు, ఇంజెక్షన్లతయారీ ఇబ్బందిగా మారింది. అయినా మూడో వంతు మందికి ఒక డోసు వాక్సిన్‌ వేశారు, నాలుగో వంతుకు రెండు డోసులూ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img