https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, February 25, 2024
Sunday, February 25, 2024

క్రతువుల సంస్కృతిని త్యజిస్తేనే పురోగతి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

1500 బి.సి.ఈ.లో భారతదేశంపై దండెత్తిన ఇండో యూరోపియన్‌ఆర్యుల వేదవాదం, దేశసంస్కృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వేదవాదం, బ్రాహ్మణ వాదంగా బ్రాహ్మణవాదం హిందూవాదంగా మారుతూ 3500 సం॥లుగా ఈ దేశంలో ఒక మత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒక సామాజిక వర్గ ప్రజలకు మాత్రమే ప్రత్యేక స్థాయి, ప్రత్యేక అవకాశాలు కేటాయించడం వేదవాదానికి ఉన్న ప్రధానలక్ష్యం! బ్రాహ్మణ వాదం హిందూవాదంగా మార్పు చెందే క్రమంలో పాత దేవుళ్లను అలాగే ఉంచి, కొత్తదేవుళ్ళను కూడా చేర్చుకుంది. వేదవాదంలో మొదట వేరువేరు ఆర్పణల ద్వారా దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడం, తద్వారా కావల్సిన భౌతిక సుఖాలు సంపాదించు కోవడం ఉండేది. అదే విధానం బ్రాహ్మణహిందూ వాదాల్లో కొనసాగింది. ‘అగ్ర’ కులానికి చెందిన బ్రాహ్మణ పురోహితులు ఈ క్రతువుల్ని ఏర్పరిచేవారు. వాటిని నిర్వహించే నియమాలు వారు ఏర్పరుచుకున్నవే. మనిషి పుట్టక ముందు మొదలయ్యే ఈ క్రతువులు మనిషి చనిపోయిన తరువాత కూడా కొనసాగుతాయి. ఆ విధంగా ఈ మత క్రతువులు భారతీయుల జీవితాన్ని పూర్తిగా శాసిస్తూ వచ్చాయి. అంటే ఏమిటీ? భారతీయ సంస్కృతే క్రతువుల సంస్కృతిగా మారిపోయిందన్న మాట! ఆధునిక ఆలోచనాధోరణి ప్రకారం క్రతువులు జరపడం అంటే మూఢాచారాల్ని కొనసాగించడమే!
బ్రహ్మ అంటే అఖండం... మహాసత్యం అని అర్ధం. అలాగే ఆత్మ అనేది ఒక బ్రాహ్మణ వాద భావన. ఈ రెండిరటి కలయికతో బ్రాహ్మణవాద ఆలోచనా విధానం బలపడిరది. అలాగే ఇది పునర్జన్మ సిద్ధాంతం కూడా ప్రవేశపెట్టింది. ఈ పునర్జన్మ చక్రాన్ని తప్పించుకుని ఆత్మబ్రహ్మలో కలవడానికి చేసే సంఘర్షణేమోక్ష సాధన! వాస్తవానికి ప్రపంచంలో, మనిషి జీవితంలో నిరంతరం మార్పులు వస్తూనే ఉన్నా ఈ భావనలు మాత్రం మారకుండా వేద/ బ్రాహ్మణ/ హిందూ వాదులు నిర్విరామంగా కష్టపడుతుంటారు. హేతుబద్ధతను ధ్వంసం చేస్తుంటారు. ప్రపంచం ఏమైనా వారికి ఫరవాలేదు. ఏదో రకంగా వారి ఆధిపత్యం కొనసాగుతూ ఉండాలన్నది వారి ఆశయం. వారి వితండవాదమే వారికి ‘శ్రీరామరక్ష’ అని భావిస్తూ ఉంటారు. శృతి అంటే వినడం…అదే సూత్రంపై వేదవాదం ఆధార పడిరది. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు వంటివన్నీ శృతి కోవలోకి వస్తాయి. కేవలం వల్లెవేయడం ద్వారా ఒకరి నుండి మరొకరికిఒకతరం నుండి మరోతరానికి అందుతూ వచ్చిన బ్రాహ్మణ జ్ఞానం అది. ఇవి సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఉన్నాయనీ, మానవమాత్రులెవరో రచించినవి కావని బ్రాహ్మణ వర్గం బలంగా విశ్వసిస్తుంది. ఇందులో విశ్వ ఆవిర్భావం, వర్గాల వర్ణాల ఆవిర్భావం, దేవుళ్ళకు జరిపించాల్సిన పూజా విధానాలు అన్నీ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా ఈ రచనల ఆధిపత్యాన్ని అంగీకరించడాన్ని బట్టి, లేదా తిరస్కరించడాన్ని బట్టి అతని ఆలోచనాధోరణిని అర్ధంచేసుకోవచ్చు. వేదవాదానికి వంతపాడుతూ, అర్థరహితమైన క్రతువులు జరిపించే వారినితిరోగమనవాదులుగా ఆధునికులు గుర్తిస్తున్నారు. కులవ్యవస్థ ద్వారా ఏర్పడిన నిచ్చెనమెట్ల సమాజంలో ప్రతివర్గం సామాజికంగా ఒకవర్గం కంటె తక్కువగానో, ఎక్కువగానో పేర్చబడి ఉంది. ఒక్క బ్రాహ్మణ వర్గం మాత్రమే అన్నివర్గాల కంటె ఉన్నతంగా ఉంటుంది. వారి కంటె ఉన్నత వర్గం ఏదీ ఉండదు. ఈ సామాజిక ఆధిపత్యం వారికి కొన్ని హక్కులు, అధికారాలు, అవకాశాలు ఇస్తుంది. మిగతావారికి బాధ్యతల్ని ఇస్తుంది. పైగా వారికి కొన్ని హద్దులు పెడుతుంది. ప్రతి ఉన్నతవర్గం ఆధిపత్య భావనతోను, ప్రతి నిమ్నవర్గం న్యూనతాభావంతోనూ ఉండాలని ఈ నిచ్చెనమెట్ల సమాజం కోరుకుంటుంది. పరిశుద్ధత, అపరిశుద్ధత అనే భావన కూడా ఈ నిచ్చెనమెట్ల సమాజానికి అతి ముఖ్యమైన సిద్ధాంతాలు. నైతిక విలువలకన్నా ఇవే, మతంలో ఆధిపత్యం చలాయిస్తాయి. పుట్టుకతోనే పరిశుద్ధత, అపరిశుద్ధత ఆపాదించబడతాయి. పుణ్యం పాపం ఆపాదించబడతాయి. మనిషి గుణానికి, నైతికతకు, నిజాయితీకి, ప్రతిభకు ఏ మాత్రం గుర్తింపు ఉండదు. దీన్ని బౌద్ధం తీవ్రంగా వ్యతిరేకించింది. పుట్టుకతో కొందరు ఉన్నతులు మరికొందరు నిమ్నులు కావడాన్ని ఖండిరచింది. నిచ్చనమెట్ల సమాజంలోకులాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. కుల సభ్యులతో మాత్రమే కలిసి భోజనం చేయాలనడం, కులసభ్యుల మధ్యనే వివాహాలు జరగాలనడం వంటివి. ఇలాంటి నియమాలు పాటించకపోతే వర్ణసంకరం జరిగి, అపరిశుద్ధత వ్యాపించి సమాజం నాశనమవుతుందని భగవద్గీత (14143) ప్రబోధిస్తుంది. వర్ణసంకరం జరగకుండా రాజ్యాలేలే రాజులు కాపాడుతూ ఉండాలని నారదస్మృతి (I11.117) చెప్తుంది. వైజ్ఞానిక అవగాహన పెరగని రోజుల్లో అవి రాయబడ్డాయి. లక్షల ఏళ్ళ క్రితం జరిగిన మానవుల వలసల గురించి వారికి తెలియదు. మానవజాతి అంతా ఒక మిశ్రమ సంస్కృతి అని సైన్సు రుజువు చేసిన విషయం వారికి తెలియదు. నాలుగు వర్ణాల విభజన సామాజిక వాదంతో… నిచ్చెనమెట్ల ఆధిపత్యం ఇంకా అలాగే కొనసాగుతూ ఉండాలని కొందరు కోరుకుంటున్నారు.
విరాట్‌పురుషుని నుంచి వర్గాలు, వర్ణాలు ఉద్భవించాయని రుగ్వేద శ్లోకం (I90) చెప్పింది. శరీరం పైభాగాల్లోంచి జన్మించినవారే పరిశుద్ధులని మనుస్మృతి (1.92) చెప్పింది. పుట్టుకతో వచ్చే అపరిశుద్ధత గురించేకాక, నిత్యజీవితంలో బిడ్డకు జన్మనివ్వడం, స్త్రీల ముట్టు, శ్మశాన కర్మలు అంటు ముట్టు, మైల, మడి వంటి అనేక అంశాలు క్రతువులకు మూలాలు. ఈ క్రతువుల నిర్వహణ అగ్రవర్ణం వారికే స్వంతం. వారే అందులో సిద్ధహస్తులు. మొత్తానికి మొత్తంగా వేద/ బ్రాహ్మణ/ హిందూవాదమంటే అది క్రతువుల సంస్కృతి ప్రతి వ్యక్తీ క్రతువులుజరపాలి. జరిపించేహక్కు మాత్రం అగ్రవర్ణానిదే. అందుకే వారు తమని తాము ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టు కున్నారు. ఇంతెందుకూ? దేవుళ్లుకనిపించని పరోక్ష దేవతలయితే, బ్రాహ్మణులు కనిపించే ప్రత్యక్ష దేవతలని విష్ణు స్మృతి (I1I20.23) ప్రకటించింది. అంటే, వారు రాసుకున్న రచనలన్నీ వారి ఆధిక్యతను ప్రకటించుకున్నాయి. అలాగే ఇంకా బ్రాహ్మణులు అర్పించే ప్రసాదం వల్లనే దేవుళ్ళకు సంతృప్తి కలుగుతుందనీ, బ్రాహ్మణులకు సంతృప్తి కలిగితేనే దేవుళ్లు సంతోషిస్తారని ఈ ప్రత్యక్ష దేవతలు ఆనందిస్తేనే పరోక్ష దేవతలు కూడా ఆనందిస్తారనీ.. బ్రాహ్మణ వాక్యానికి తిరుగులేదనీ అది అక్షర సత్యమనిమనుస్మృతిలోని చాలా శ్లోకాలు (1.93), 95, 96, 98,100) ప్రకటించాయి. ధర్మంకోసం జన్మించిన బ్రాహ్మణుడే బ్రహ్మ అని ఈ సృష్టి మొత్తానికి బ్రాహ్మణుడే దేవుడని, అతడే మనుషుల్లో కెల్లా అద్భుతమైన తెలివితేటలు గలవాడని… మనుస్మృతి శ్లోకాలు నిర్ద్వందంగా ప్రకటించాయి. ఇలాంటి విషయాలన్నీ అధిక సంఖ్యాకులైన ఈ దేశంలోని శూద్రులు గ్రహించాలి. ఆధిక్యతల్ని ఎండగట్టాలి. క్రతువుల్ని త్యజించాలి. అవన్నీ కుట్రపూరితంగా ప్రచారం చేసిన మూఢనమ్మకాలని తెలుసు కోవాలి. నిచ్చెనమెట్ల వ్యవస్థని విరగ్గొడితేగాని, సమభావం వర్ధిల్లదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది! (శూద్రులు, బ్రాహ్మణులు వంటి పదాలు వడడం కూడా నాకు ఇష్టం ఉండదు. కాని, విషయం అర్థమయ్యేట్లు చెప్పాలి కాబట్టి, తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. ‘మానవజాతి అంతా ఒక మిశ్రమ సంతతి. అయితే మనుషులంతా ఒక్కటే’అనే భావన ఉన్న వారికి మనుషుల్ని విభజించే పదాలు ఉపయోగించాలంటే ఇబ్బందిగానే ఉంటుంది). కులవ్యవస్థలోని శూద్రులు ఈ దేశ మూలవాసులు. ఆర్యులనే అణగదొక్కబడ్డవారు ఉదాహరణకు మహాభారతం లోని శాంతిపర్వం చూద్దాం. అందులో (అధ్యాయం I11) రాజుధర్మ పర్వంలో శూద్రుడు ఉన్నతవర్గాలకు బానిసని (27) అతడు బానిసత్వాన్ని సంతోషంగా స్వీకరించాలని (28) సంపద సమకూర్చుకోకూడదని (29) సమకూర్చుకుంటే క్రూరుడవుతాడని (30) ఎల్లప్పుడూ ఇతరవర్గాల వారి దయా దాక్షిణ్యాలపై జీవించాలని (31) అగ్రవర్ణాల వారు వాడుకుని వదిలేసిన బట్టలు, ఇతర వస్తువులు స్వీకరిస్తూ ఉండాలని (32,33) రాసి ఉంది. శూద్రుల లక్ష్యం సేవేనని మనుస్మృతి, భగవద్గీత ప్రకటించగా అదనంగా మహాభారతం శూద్రుడు పేదవానిగా బానిసగా మాత్రమే ఉండాలని అన్నది. శూద్రులు మతగ్రంథాలు చదవగూడదని ఆంక్షలు విధించింది. శూద్రులు స్మశానంతో సమానం గనుక, వారి సమీపంలో వేదం చదవగూడదని చెప్పిందివశిష్ట స్మృతి (18, 913, 16). శూద్రునికి ధర్మం బోధన చేసిన వారు శూద్రస్థాయికి దిగజారుతారు. వేదం విన్న శూద్రుని చెవిలో సీసంతరగం పోయాలి. ఉచ్ఛరిస్తే నాలుక కత్తిరించాలి. గుర్తుంచుకుంటే చంపేయాలి అని గౌతమధర్మ సూత్రం వక్కాణించింది. కోట్లమంది ప్రజల్ని కాల్చుకుతిన్న వేద సమాజం, శూద్రుల్ని అమానవీయ స్థితిలోకి తొక్కేసింది. అహింసను పాటించని హింసాత్మక సమాజమది. క్రతువుల పేరుతో జంతుబలులు, నరబలులు యధేచ్ఛగా కొనసాగించిన సమాజమది. ఇలాంటి కిరాతక పోకడల్ని ఇప్పటి అభ్యుదయవాదులే కాదు, కామన్‌ ఎరాకు పూర్వమే (బిసిఈ) చార్వాకులు ఖండిరచారు. బుద్ధుడు నిరసించాడు.
ఆనాటి అహేతుకమైన పరిస్థితులను గమనించే బుద్ధుడు తన ధమ్మాన్ని (ధర్మాన్ని) ప్రభోదించాడు. అది విశ్వ మానవాళికి వర్తించే ధమ్మం. ఆధిపత్యాన్ని, అహంకారాన్ని త్యజించమన్న ధమ్మం. మానవ సంబంధాలను పునర్నిర్వచించిన ధమ్మం. నైతికతతో, మానవత్వంతో మనిషి మనిషిగా వెలుగొందాలని ప్రసరించిన వెలుగు. తమ ఆధిపత్యం తగ్గిపోతున్నదని వైదిక ప్రబోధకులు మొదట బౌద్ధాన్ని వేదమతంలో కలుపుకుని, ఆ తర్వాత క్రమక్రమంగా దాన్ని నాశనం చేస్తూ వచ్చారు. మళ్ళీ తమ నిచ్చెనమెట్ల సమాజాన్ని పునరుద్ధరించుకుంటూ వచ్చారు. అభ్యుదయ కాముకులు ఈ కుట్రను గమనిస్తూనే ఉన్నారు. విప్లవాత్మకమైన సామాజిక పరివర్తనకు బౌద్ధం కృషి చేసిన విషయం గ్రహిస్తూనే ఉన్నారు. ఆల్‌బ్రెప్ట్‌ా ఫ్రైడ్‌రిచ్‌ లెబర్‌ (18251901) జర్మన్‌ ఇండాలజిస్ట్‌ ఇలా అన్నారు. ‘దేవుడి నుంచి పుట్టామని చెప్పుకునే వర్గం చేసే దోపిడికి, అణచివేతకు వ్యతిరేకంగా, మనిషి హక్కులకోసం వచ్చిన విప్లవాత్మకమైన ప్రతిస్పందనబౌద్ధం! బ్రాహ్మణీయ అసమానత్వ వ్యవస్థను ధిక్కరించిన బౌద్ధం, భారత ప్రజల్లో గతాన్ని విడనాడే ఒక నూతన మార్పుకు బీజం వేసింది. బ్రాహ్మణీయ కులవ్యవస్థతో విధ్వంసమైన మానవీయ విలువలను పునరుద్ధరించి, మానవులందరికీ సమాన హక్కులు ఉండాలనే భావనను కల్పించింది. పుట్టుక, వర్గం, వర్ణం, హోదా, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సరైన జ్ఞానం అందాలని బౌద్ధం తీవ్రంగా శ్రమించింది. అందువల్ల బౌద్ధంలో తాత్త్విక, నైతిక, విశిష్టతల గొప్పదనం సహజంగా ఎక్కువ!’. వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img