Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

క్రిమినల్‌ కేసుగా బాబ్రి కూల్చివేత

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

బాబ్రి మసీదు కూల్చివేతలో నిందితుల జోక్యా నికి తగిన ఆధారాలు లేవని 32 మంది బీజేపీ ప్రము ఖులు ఆడ్వానీ, మురళి మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కతియార్‌, రితంబర వగైరాలు నిర్దో షులని 30.09.2020న సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పి చ్చింది. కేసులో సాక్షులైన మహబూబ్‌, సయ్యద్‌ అఖ్లాఖ్‌లు 8.1.2021న ఈ తీర్పుపై పునర్విచార ణకు అభ్యర్థన చేశారు. మసీదును కూల్చిన తర్వాత పక్కనే ఉన్న వీరి ఇళ్లను సంఫీుయులు కాల్చారు. ఈ కేసు పునర్విచారణ కుదరదని, క్రిమినల్‌ అప్పీల్‌గా మార్చాలని జస్టిస్‌ దినేష్‌ కుమార్‌ సింగ్‌ తన కార్యాలయాన్ని ఇటీవల ఆదేశించారు.
6.12.1992న బాబ్రి మసీదును కావాలని కూల్చివేశారు. కూల్చివేతకు పథకం లేదు. ఇది సంఘ వ్యతిరేకశక్తుల ఆకస్మిక చర్య. ఇదీ లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. ఆకస్మికత న్యాయసమ్మతమా? ‘‘అశోక్‌ సింఘాల్‌ కూల్చే వారిని ఆపడానికి ప్రయత్నించారు. సీబీఐ ఆధారాలు చూపడంలో విఫలమైంది. (చెప్పినట్లు నటించింది)’’ ఇది న్యాయమూర్తి సురేంద్రకుమార్‌ యాదవ్‌ వివరణ. కరసేవను ప్రారంభించిన సింఘాల్‌కు మసీదు కూలుతుందని బాధలేదు. మసీదులోని బాలరాముని బొమ్మ పగులుతుందని భయం. 850 సాక్షాలు, 7వేల పత్రాల్లో కోర్టుకు ఆధారాలే దొరకలేదు. మసీదును కూల్చిన 1.5 లక్షల మంది కరసేవకులనూ నిర్దోషులుగా వదిలారు. మసీదు కూల్చివేతకు రెచ్చగొట్టే ఉప న్యాసాలు, హిందు, ముస్లింల మధ్య శతృత్వంపెంపు, అల్లర్ల ప్రేరేపణ ఇవి నింది తులపై అభియోగాలు. ఇవి వాస్తవం. కరసేవకుల కవ్వింపునకు, ప్రణాళిక లేని మసీదు కూల్చివేతకు కరసేవ నిర్వాహకులదే తప్పు. సీబీఐ కాంగ్రెస్‌ గూటి చిలు కని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. బీజేపీ బందీనని తానే రుజువు చేసుకుంది.
అయోధ్యలో బాబ్రి మసీదు స్థలాన్ని రామ జన్మభూమిగా సంఫ్‌ు ప్రకటిం చింది. మసీదున్న చోటే మందిర్‌ కట్టాలని తీర్మానించింది. మసీదును కూల్చేసి మందిర్‌ కట్టాలి. మందిర్‌ నిర్మాతలే మసీదు కూల్చివేత కుట్రదారులు. నేల చదును చేయమని కరసేవకులకు వాజ్‌పేయి సూచించారు. పికాసి, గునపాలతో ఊగుతున్న కార్యకర్తలకు ఈ మాట మసీదును కూల్చాలన్న సంకేతాన్నిచ్చింది. నాటి ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ మసీదును కాపాడతానని సుప్రీంకోర్టుకు మాటిచ్చి, కూల్చివేతకు ఏర్పాట్లు చేశారు. పోలీసులను కట్టడి చేసి కూల్చివేతకు సాయపడ్డారు. కాంగ్రెస్‌ ముసుగు సంఫ్‌ు ప్రధాని నరసింహారావు మౌనంతో తోడ్పడ్డారు. తర్వాత, తప్పుచేశానని శిక్ష అనుభవించడానికి సిద్ధమని సింగ్‌ అన్నారు. ఉమాభారతి మేము మసీదును కూల్చామని గర్వంగా చెప్పారు. కూల్చివేతకు శివసేన బాధ్యత వహించింది. ఇవన్నీ కూల్చివేత కుట్రకు సాక్ష్యాలే.
బాబ్రి కూల్చివేత మత అల్లర్లకు దారితీసి 3 వేల ప్రాణాలు తీసింది. గోధ్రా ఘటనకు, నేటి ఘోరాలకు మూలం ఇదే. నాటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజ నాథ్‌సింగ్‌ 8-10-1993న కూల్చివేత కేసును రాయిబరేలి కోర్టు నుండి లక్నో కోర్టుకు మార్పించారు. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. హైకోర్టు ఆమోదం తప్పనిసరి. ఈ లోపాన్ని సరిచేసుకోమని 12-2-2001న యుపి హైకోర్టు రాజనాథ్‌ను ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాన్ని పాటించలేదు. ఫలి తంగా ఆడ్వానీ, ఉమాభారతితో పాటు 12 మంది ప్రత్యేక కోర్టు విచారణ తప్పిం చుకున్నారు. 1998 వరకు, 2004-2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సీబీఐ విచారణ చేపట్టలేదు. మెజారిటి మత ఓట్ల విషచట్రం వారిని కూల్చివేత కుట్ర అన్వేషణ నుండి దూరం చేసింది. 18 ఏళ్ల తర్వాత మొదలైన విచారణ నత్తలా నడిచింది. ప్రజాప్రతినిధుల నేరాలు తొందరగా విచా రించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బాబ్రి కూల్చివేత కేసులో జాప్యానికి 6.3.2020న ఆందోళన వెలిబుచ్చింది. లక్నో, రాయిబరేలీ కేసులను కలిపి విచారించమంది.
2019 నవంబరులో మసీదు స్థల వివాదంలో సుప్రీంకోర్టు భక్తివిశ్వాసాల తీర్పిచ్చింది. మసీదులో రామ బొమ్మ పెట్టటం అపవిత్ర చర్య. మసీదు కూల్చివేత ఘోర చట్ట ఉల్లంఘన అంటూనే మొత్తం 2.77 ఎకరాలూ రామునికే ఇచ్చింది. మసీదును రక్షిస్తామని తనకిచ్చిన హామీని తుంగలో తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా మసీదు కూల్చిన వారికే మసీదు-స్థలం కట్టబెట్టింది. చట్టవ్యతిరేక చర్యలనే గౌరవించటం, బాధితులకు కాక నేరస్తులకే లబ్ధి చేకూర్చటం తీర్పు వైరుధ్యం. తాము కోరిన తీర్పులనే కోర్టులిచ్చాయని బీజేపీ నాయకులన్నారు. 2010లో సుప్రీం జడ్జీలు పిసి ఘోష్‌, ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌లు మసీదు కూల్చివేత భారత లౌకిక బంధాన్ని తెంచిందన్నారు. న్యాయమూర్తి మన్మోహన్‌సింగ్‌ లిబర్హాన్‌ వాజ్‌ పేయి, ఆడ్వానీ, జోషిలకు పరివార్‌ కూల్చివేత పథకం తెలియదనడానికి వీల్లేదని తన సుదీర్ఘ నివేదికలో వివరించారు. కరసేవకుల సమీకరణ ఆకస్మికం, ఐచ్ఛికం కాదు. పథకం ప్రకారం చేసిన ఏర్పాటన్నారు. ‘‘కరసేవకులైన’’ విశ్వ హిందు పరిషత్‌ కార్యకర్తల అభ్యాసాల ఫోటోలు, వీడియోలను మసీదు కూల్చివేత తర్వాత మీడియా చూపింది. చాలా ప్రదేశాల్లో జరిగిన సమావేశాల్లో నిందితులు సంతోషంగా పాల్గొన్నారు. ఈ పని దేశభక్తి గేయాలతో కాక పార, పికాసి, సమ్మెట, తాళ్ళు, ఇటుకలతో జరగాలని ఆడ్వానీ నొక్కిచెప్పారు. ‘‘సేవకులు’’ ఈ పనిముట్లతోనే వెళ్లారు. ‘‘ఇంకొక వేటు వెయ్యి. మసీదు కూల్చివెయ్యి’’ వంటి నినాదాలు మిన్నంటాయి. ఈ ఫోటోలు, వీడియోలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న ప్రవీణ్‌ జైన్‌ దగ్గర ఉన్నాయి. అప్పుడు పయోనీర్‌లో పనిచేసిన ఆయన విహెచ్‌పి సభ్యునిగా సాధనా స్థలాలకు వెళ్లారు. రామకథ కుంజ్‌పై నుంచొని ఆడ్వానీ, జోషి, విజయరాజే సింధియా, రితంబర నినాదాలతో ప్రేరేపిస్తూ, మసీదు కూల్చివేతను చూస్తున్న ఫోటో వాటిలో ఉంది. రెచ్చగొట్టడం ప్రమాద కరం. ఈ సాక్ష్యాలను సీబీఐ ఇవ్వలేదా? నేటి భారత ప్రభుత్వ హిందు ఆధి పత్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పులిస్తున్నాయి.
గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాస్తవపత్రంలో మసీదు కూల్చివేత జాతీయ అవమానమంది. నేటి సంఫ్‌ు ప్రభుత్వం జాతీయ సిగ్గును భారతీయ సాంస్కృతిక గౌరవంగా మార్చింది. మసీదును ఎవరూ కూల్చలేదు, దానంతటదే పడిరదన్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించాయి. ఈ తీర్పు న్యాయ మైందా అన్నది చరిత్ర చెపుతుందని సీనియర్‌ అడ్వొకేట్లు ప్రశాంత్‌ భూషణ్‌, సంజయ్‌ హెగ్డే బాధపడ్డారు. ‘‘టాగూర్‌ అన్నట్లు నేడు న్యాయం మౌనం వహించింది. ఏడుపే దాని గత్యంతరం.’’ అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి అశోక్‌ కుమార్‌ గంగూలీ వాపోయారు. ఈ తీర్పుతో సమాజ, మత విభజన, ముస్లింల భయాందోళనలు పెరిగాయి. ఓట్ల కోసం ముస్లింలను దువ్విందన్న నింద మోసిన కాంగ్రెస్‌ బలహీనపడిరది. ముస్లింలకు కొంత అండగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. బీజేపీ మతాధార ఎన్నికలు, హిందు సమీకరణ ముస్లింలను ఇతరులను చేశాయి. వారు ఏకాకులయ్యారు. ప్రజా స్వామ్యం, రాజ్యాంగాల మీద నమ్మకం కోల్పోతున్నారు. వారిలో అన్యాయాల, అక్రమాల ఆందోళనలు, అభద్రతాభావం ఎక్కువయ్యాయి.
6.12.1992న రామ జన్మభూమిలో ఏమైందో, ఎందుకయిందో, ఎవరు చేశారో, ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎంత ప్రజా సంపద నష్టమైందో, ఎవరికి రాజకీయ లబ్ధి కలిగిందో, లౌకికత్వ, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు ఎంత దిగజారాయో మనకు తెలుసు. వాటిని చట్టసమ్మతం చేశాం. మోసగాళ్లను మన్నించటం, మోసాలను మరవటం మన సుగుణం. ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల, కేంద్ర ఎన్నికల్లో వారినే గెలిపించాం. ఇప్పుడు వల్లకాటిలో కేకలు పెడుతున్నాం.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img