Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

నిజాం నిరంకుశత్వాన్ని ఎండగట్టిన షోయబ్‌

కామిడి సతీష్‌ రెడ్డి

అతను ఒక అక్షర సేనాని, నిజాం నిరంకుశ త్వాన్ని తన కలంతో ఎండ గట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, పాత్రికేయ వృత్తికి వన్నెతెచ్చిన యోధుడు. నికార్సయిన వార్తలతో రజా కార్ల, నిజాం ఆగడాలను ప్రశ్నించి, విలువలు గల సంపాదకీయాలు రాసిన మేరు నగధీరుడు షోయబుల్లా ఖాన్‌. నిబద్దత, విశాల భావాలు కల వాడు, అభ్యుదయవాది. మత దురహంకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. షోయబ్‌ 1920లో అక్టోబరు 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీ బుల్లాఖాన్‌. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పని చేశారు. తల్లి లాయ హున్నీసా బేగం. షోయబుల్లాఖాన్‌ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్‌ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిరది. షోయబ్‌ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ జర్న లిజం డిగ్రీ చేశాడు. షోయబ్‌ ను ఆయన తండ్రి ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్‌ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించాడు.
ఇమ్రోజ్‌ పత్రికలో నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ రాసి నందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు 1948, ఆగష్టు 22న పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమ యంలో షోయబ్‌ను మత దురహంకారులు, రజాకార్లు అతిక్రూరంగా కాల్చిచంపారు. ‘‘షోయబుల్లాఖాన్‌ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్‌ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్‌ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.
షోయబ్‌ రచనా జీవితం తేజ్‌ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్‌ పత్రికను నిషేధించింది. ఆ సమయం లోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌ నాయకుడు ముందుముల నరసింగరావు సంపాద కత్వంలో వెలువడుతున్న రయ్యత్‌ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్య తలు చేపట్టారు. రయ్యత్‌ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధాన పరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్‌ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజా ఉద్యమాన్ని అణచి వేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.
రయ్యత్‌ నిషేధానికి గురయ్యాక షోయబుల్లా ఖాన్‌ స్వంత నిర్వ హణలో ఇమ్రోజ్‌ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాద కత్వ బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు మందుముల నర్సింగరావు బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు. ఈ సమయంలో షోయబుల్లాఖాన్‌ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇమ్రోజ్‌’ను స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు ఇంట్లో ఇమ్రోజ్‌ ఆఫీస్‌ ఉండేది. ఉర్దూలో ఇమ్రోజ్‌ అంటే ఈ రోజు. నిజాంకు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించే వాడు. రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నోసార్లు ఆవేదన చెందాడు. హైదరాబాద్‌ భారత్‌లో విలీనం కావాలనేది షోయబుల్లాఖాన్‌ కల, లక్ష్యం. దాని కోసం నడిరోడ్డు మీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం… మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్‌ జాతీయో ద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రతీ రచయిత, పాత్రికేయుడు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతి, అక్రమాలు వెలికి తీయాలి. సమాజంలో పాత్రికేయ వృత్తి గౌరవాన్ని మరింత ఇనుమడిరప చేయాలి. ప్రతి జిల్లాలో వారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన జయంతిని నిర్వహించుకుని షోయబుల్లాఖాన్‌ సేవలను స్మరించు కుందాం.
(నేడు షోయబుల్ల్లాఖాన్‌ జయంతి)
వ్యాస రచయిత సెల్‌ 9848445134

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img