Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

పెరియార్‌… అంధ విశ్వాసాలపై అస్త్రం!

కులాన్ని, మత మౌఢ్యాన్ని, వీటికి మూలమైన దైవభావాన్ని చీల్చిచెండాడిన మహోన్నత పోరాట యోధుడు పెరియార్‌ రామస్వామి. అసలు పేరు ఇ.వి. రామస్వామి. పెరియార్‌ అంటే ‘‘పెద్ద మనిషి’’ అనేది ఆయనకు ప్రజలు ఇచ్చిన గౌరవ బిరుదు. 1879లో సెప్టెంబరు 17వ తేదీన జన్మిం చిన ఆయన 1973లో డిసెం బర్‌ 24న కన్నుమూసారు. పెరియార్‌ జీవితాంతం కుల వ్యవస్థ నిర్మూలన కోసం, మూఢ నమ్మకాల నిర్మూ లన కోసం పోరాడారు. బాల్యంలో తండ్రిపై కోపంతో అలిగి కాశీకి వెళ్ళడం రామస్వామి జీవితాన్నే మార్చింది. అక్కడ తినడానికి డబ్బు లేదు. పొట్ట మలమల మాడుతోంది. ధర్మ సత్రంలో అన్నదానం జరుగు తుంటే వెళ్లి వరుసలో కూర్చు న్నాడు. ఆ సత్రంలో బ్రాహ్మలకు మాత్రమే అన్నం పెడుతున్నారు. ఈ యువకుని వేషం చూసి నిర్వాహకులు బ్రాహ్మడు కాదనుకొని లాగి బయటకు నెట్టారు. ఆకలేస్తోంది, ఏం చేయాలో తెలియలేదు. బయట వేసిన ఇస్తరాకుల్లోని అన్నం తినబోతే కుక్కలు లాక్కుపోయాయి. తలపైకెత్తి సత్రం మీదనున్న అక్షరాలను చదివాడు. ఆ సత్రం బ్రాహ్మల కోసం తమిళ శూద్రులు కట్టింది. అర్థమైంది.. తమిళ శూద్రులు నిర్మించిన సత్రంలో తమిళ శూద్రునికి ప్రవేశం లేదు. అంతే ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. ఈ ఆలోచనే ఆయన జీవితంలో పెనుమార్పు తెచ్చింది. కుల వ్యవస్థ మీద కసి పెంచింది. ఈ కసి రామస్వామిని తమిళ ప్రజల చేత పెరియారుగా పిలిపించుకునేలా చేసింది. బ్రాహ్మణాధిపత్యాన్ని, కుల రక్కసిని, దైవ భావాన్ని దహించే విధంగా దక్షిణ భారతంలో ఒక దావాగ్నిని సృష్టించే పోరాటయోధుడిగా చేసింది. దేవుడు లేడు …దేవుడు లేడు…దేవుడు లేడు అని ఎలుగెత్తి చాటిన ధైౖర్యశాలి పెరియార్‌. అంతేకాదు ‘‘దేవుని విగ్రహాన్ని శూద్రుడు తాకినందున ఆ దేవుడు మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని పగులగొట్టి ఆ ముక్కలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలి. అలా కాకపోతే ఆ బండను చాకిరేవు కాడ బట్టలు ఉతికేందుకు వాడుకోవచ్చు’’ అని చెప్పటానికి ఎంత ధైర్యం కావాలి? అందుకే పెరియార్‌ నాస్తికులకు హేతువాదులకు ఆదర్శంగా నిలిచారు. మగ వారితోపాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలంటూ ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో ఉద్యమాలు చేసారు. 1909లో వితంతు వివాహాన్ని జరిపించారు. 1914లో ఈరోడ్‌ నగరానికి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా, నిమ్న కులాల అభివృద్ధి కోసం జస్టిస్‌ పార్టీలో చేరిన ఆయన 1944 లో జస్టిస్‌ పార్టీని ‘ద్రావిడ కజకం’ గా మార్చారు. ఆ పార్టీ నుండి వచ్చినవే డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు. కేరళలో నారాయణ గురు, మహారాష్ట్రలో ఫూలే, మద్రాస్‌ రాష్ట్రంలో ఇద్దరు రామస్వాములు (పెరియార్‌, త్రిపురనేని) లాంటి ఉద్దండులు ఆనాడు బ్రాహ్మణా ధిపత్యానికి వ్యతిరేకంగా, మతంలో పాతుకుపోయిన అంధ విస్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులుగా చరిత్రలో నిలిచిపోయారు. వర్తమాన, భవిష్యత్‌ యువతకు పెరియార్‌ ఒక స్ఫూర్తిదాత.
(నేడు పెరియార్‌ జయంతి)
నార్నె వెంకట సుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img