Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రజా పునాదిపై సీపీఐ నిర్మాణం

తాటిపాక మధు

సిద్ధాంతాలు చక్కగా చదువుకొని, సమావేశాలలో మంచి తీర్మానాలు చేసుకొని తమలో తాము విమర్శ`ఆత్మ విమర్శలతో కాలం గడిపినంత మాత్రాన ఎవరూ మంచి కమ్యూనిస్టు లయిపోరు. ఈ మొత్తం కృషికి పరమార్థం పీడిత, తాడిత ప్రజావిముక్తి గనుక ఆ ప్రజలకు చేరువకావడమే కమ్యూనిస్టుల అసలు సిసలు కర్తవ్యమవుతుంది. ప్రజలతో ప్రగాఢ సంబంధాలు వున్నప్పుడే సిద్ధాంతాలకు, తీర్మానాలకు విలువ. ‘‘నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితేనే ముత్యం అయినట్లు’’ సిద్ధాంతాలపై ప్రజలకు అవగాహన కలిగినప్పుడే భౌతిక శక్తి అవుతుంది.

ప్రజాపునాదిపై సీపీఐని పటిష్ఠంగా నిర్మించాలని విశాఖపట్నంలో ఈనెల 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రస్థాయి వర్కుషాపు నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర సమితి, జిల్లా కార్యవర్గ సభ్యులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, కార్యదర్శి వర్గ సభ్యులు డా.కె నారాయణలు ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీనిర్మాణంఅంశంపై పార్టీ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ, శాఖలు నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం తదితర అంశాలపై సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళనాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తిలు మాట్లాడారు. అనేక అంశాలపై ఉపాధ్యాయులు బోధించారు. ఈ అంశాలపై 13 జిల్లాల పార్టీ బాధ్యులు చర్చించుకుని పార్టీ నిర్మాణానికి దోహదపడే చాలా అంశాలపై ఒకజిల్లా నుండి ఒకరు మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముగింపు పలుకుతూ ఈ విశాఖపట్నం వర్క్‌షాపు పార్టీ నిర్మాణానికి ప్రజా పునాదిని నిర్మించుకోవాలని ఒక మనిషికి గుండె ఎటువంటిదో పార్టీకి శాఖ అటు వంటిదని నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నెలాఖరు వరకు 13 జిల్లాల్లో పార్టీ శాఖల కార్య దర్శులకు వర్క్‌షాపులు నిర్వహిస్తుంది. నవంబరు ఒకటి నుంచి 20వ తేదీ వరకు 2932 శాఖల సమావేశాలు నిర్వహిస్తుంది.
ఎందుకు శాఖ సమావేశాలు : సిద్ధాంతాలు చక్కగా చదువుకొని, సమావేశాలలో మంచి తీర్మానాలు చేసుకొని తమలో తాము విమర్శఆత్మ విమర్శలతో కాలం గడిపినంత మాత్రాన ఎవరూ మంచి కమ్యూనిస్టు లయిపోరు. ఈ మొత్తం కృషికి పరమార్థం పీడిత, తాడిత ప్రజావిముక్తి గనుక ఆ ప్రజలకు చేరువకావడమే కమ్యూనిస్టుల అసలు సిసలు కర్తవ్యమవుతుంది. ప్రజలతో ప్రగాఢ సంబంధాలు వున్నప్పుడే సిద్ధాంతాలకు, తీర్మానాలకు విలువ. ‘‘నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితేనే ముత్యం అయినట్లు’’ సిద్ధాంతాలపై ప్రజలకు అవగాహన కలిగినప్పుడే భౌతిక శక్తి అవుతుంది. మనదేశంలో కార్మికవర్గ నాయకత్వం, కార్మికకర్షక ఐక్యతే గ్రామీణప్రాంతాలలో వ్యవసాయకార్మికులను పునాది వర్గంగా సమీకరించి నప్పుడే పార్టీ లక్ష్యం నెరవేరుతుందని గత మహాసభలలో తీర్మానం చేసుకున్నాం. ప్రతి యేడాది సభ్యత్వం రెన్యువల్‌తో పాటు శాఖల వివరాలను రాష్ట్ర కమిటీకి అందజేస్తాం. కాని సంవత్సరంలో ఒకసారైనా శాఖ సమావేశం నిర్వహించామా? ఆ ప్రాంతంలో వున్న ప్రజా సమస్యలు గుర్తించామా? లేదు. ఏది ముఖ్యమో అది చేయకుండా మనము బూర్జువారాజకీయపార్టీలవలేమనం కొట్టుకుపోతున్నాం.
కామ్రేడ్‌ లెనిన్‌ ఒకమాట చెప్పారు. ప్రజలతో సంబంధాలు పెరగనిదే నిజమైన కమ్యూనిస్టు స్ఫూర్తి పట్టుబడదు. ప్రజల నాడి తెలియనిదే కార్యచరణకు పట్టు చిక్కదు. నీళ్ళల్లోని చేపల్లా కమ్యూనిస్టులు ప్రజల్లో వుండి పనిచేయాలి.
మనం ఏమిచేయాలి?: మండల, నియోజకవర్గ, జిల్లా కార్యదర్శులు శాఖ కార్యదర్శి ఇంటికి వెళ్ళాలి. అతనితో ఆ ప్రాంతంలో పర్యటించాలి. ప్రజల సమస్యలను గుర్తించాలి. శాఖ కార్యదర్శి ఇంటివద్దే భోజనం చేయాలి. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. శాఖ కార్యదర్శి మనల్ని నమ్మాలి తరువాతపార్టీపై నమ్మకం కలిగించాలి. తర్వాత శాఖ సమావేశం నిర్వహిస్తే ఉపయోగాలు ఉంటాయి. ఆ ప్రాంతం సమస్యలు నాయకత్వానికి అవగాహనకు వస్తాయి. ఇది నిరంతరం ప్రక్రియగా జరగాలి. మనతో పరిచయమైన వారిని నెమ్మదిగా రాజకీయ చైతన్యవంతులును చేయడానికి ప్రయత్నించాలి.
శాఖ పటిష్ఠంగాఉంటే: సరైన సంబంధాలు ఉన్నట్లయితే బలమైన ఉద్యమాలు చేయగలం. ఉదాహరణకు 1942లోపార్టీ ఫాసిజానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కర్తవ్యంగా పోరాడుతున్న సమయంలో దాన్ని అవకాశంగా తీసుకొని శత్రువులు పార్టీని బ్రిటీష్‌ ఏజెంట్‌ అని విషప్రచారం చేశారు. అయినా కింద శాఖ పటిష్టంగా ఉంది కాబట్టి పార్టీ పునాది దెబ్బతినలేదు. 194850 మధ్య మా జిల్లాలో కమ్యూనిస్టులపై భయంకరమైన నిర్బంధకాండ సాగించి వందలాది మందిని చంపారు. అయినా ప్రజలతో పెనవేసుకుని ఉన్న కారణంగా నిర్బంధం ఎత్తివేసిన తర్వాత 1952లో ఎన్నికలు జరపగానే పార్టీ అఖండ విజయం సాధించింది. శాఖ ఎజెండా ముఖ్యం : ప్రతి శాఖ కార్యదర్శి ఆ ప్రాంతంలో వున్న సమస్యలను గుర్తించి ముందుగానే ఎజెండాను తయారు చేయాలి. ఎజెండా రెండురకాలుగా ఉండాలి. 1) ఆ ప్రాంతంలో వున్న ప్రజాసమస్యలు 2) రాజకీయ రిపోర్టు పార్టీ నిర్మాణం. ఈ రెండు చాలా కీలక అంశాలు. ఎందుకంటే ప్రతి పార్టీ సభ్యుడికి మన రాజకీయ విధానం తెలియాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను చెప్పాలి. వారి సమస్యలే కాకుండా సభ్యుడికి మార్క్సిజంపైన నమ్మకం కలిగించాలి. ఈ దోపిడీ సమాజం ప్రత్యామ్నాయం కమ్యూనిజమే అని చెప్పాలి. అలా కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసి వదిలేస్తే రేపు అవి పరిష్కారం కాగానే ప్రజలు మనతో ఉండరు. ప్రతిశాఖకు విశాలాంధ్ర/కమ్యూనిజం : 1900లో అంటే ఇరయ్యో శతాబ్ధి మొదటి పాదంలో లెనిన్‌ ఇష్క్రాపత్రిక స్థాపించారు. ‘‘అగ్ని కణమే జ్వాలను రగిలిస్తుంది’’ అనేది దాని నినాదం. నిజంగానే ఆ జ్వాలలు జారిస్టు నిరంకుశత్వాన్ని దగ్ధం చేశాయి. పత్రిక అంటే ఆర్గనైజర్‌ అని లెనిన్‌ చెప్పేవారు. ప్రజా పునాదికి ముఖ్యమైనది పార్టీ శాఖ కాబట్టి పార్టీ కార్యక్రమాలురాష్ట్ర రాజకీయాలు ముందు శాఖ కార్యదర్శికి తెలియాలి. విశాలాంధ్ర ఏజెంటు లేకపోయినా కనీసం పోస్టుద్వారాఅయినా పత్రిక తెప్పించు కోవాలి. ప్రతి సభ్యుడికి సైద్ధాంతిక పరిజ్ఞానం కోసం కమ్యూనిజం చేర్పించాలి.
పై నుండి కిందకు : జిల్లా కార్యదర్శి ప్రతీరోజూ ఉదయం మండల, నగర, నియోజక వర్గ కార్యదర్శులతో పాటు శాఖలను ఎంపిక చేసుకొని వారితో మాట్లాడాలి. ఈ రోజు కార్యక్రమాలు ఏమిటి అందరూ కుశలంగా ఉన్నారా అని అడగాలి. అలాగని పెత్తనంచేయకూడదు. శాఖ కార్యదర్శి ఎలా స్పందిస్తున్నారో? ఏమి అంటున్నారో తెలుసుకోవాలి. అప్పుడే వారిని ఏ అంశాలపైన కదిలించ గలమో అర్థమవుతుంది. అంతేకాదు వారిలో సమస్యల పట్ల నిజమైన స్పందన కలుగుతుంది. ‘‘సిద్ధార్ధుడు మానవుడి బాధలు చూసిన తర్వాతనే బుద్దుడు కాగలిగాడు.
పార్టీ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబరులో జరుగుతాయి. ఈ మహాసభలు స్ఫూర్తితో ఒక లక్ష్యంతో పార్టీ శాఖలను పటిష్ట పరుచుకుందాం.
గతంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. అమలు చేసాం. కాని ఇంకా అనేక లోటుపాట్లు ఉన్నాయి. మా జిల్లాలోనే 135 శాఖలు ఉన్నాయి. సగం శాఖలలో నిర్మాణం లేదు. ఇప్పుడు విశాఖపట్నం వర్క్‌షాపు విజయవంతంగా జరిగి ఇచ్చిన ఉత్తేజంతో ఈనెల 19న జిల్లా వర్క్‌షాపు రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img