Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ప్రాథమిక హక్కుల రక్షణే సుప్రీం లక్ష్యం

అరుణ్‌ శ్రీ వాస్తవ

మోదీ ప్రభుత్వం ఈ సమస్యను రాజకీయం చేయాలని చూస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. తమ ప్రభుత్వం కోర్టు బాధితురాలని ప్రచారం చేసుకుని రానున్న ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆలోచన మోదీకి ఉందనిపిస్తోంది. బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమాదకరమైన ఆటాడుతున్నాయి. మోదీ ప్రభుత్వం, కొంత మంది పైస్థాయి అధికారులు, కొందరు మంత్రులు ఈ కుట్రలో భాగస్వాములని చెప్పటానికి సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమాచారం దాచివేయాలన్న ఆలోచనలోనే కేంద్రం ఉంది.

గూఢచర్యంలో పెగాసస్‌ స్పైవేర్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించాలనేదే సుప్రీంకోర్టు లక్ష్యం. అయితే కేంద్రం మాత్రం పెగాసస్‌పై తాజాగా సమగ్ర ప్రమాణ పత్రాన్ని సమర్పించే సమస్య లేదని చెప్పింది. అది సున్నితమైనదని, దేశ భద్రతకు సంబంధించిందని చెప్పడం ద్వారా రెండు రాజ్య సంస్థల మధ్య ఘర్షణ వాతా వరణం సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోందా? ఇదే సమయంలో అసలు విష యాన్ని దాచేందుకు కుట్ర పన్నిందని భావించవలసి వస్తోంది. పెగాసస్‌ కుంభ కోణం ఎవరి పని అనేది వెలుగులోకి తేవాలని సుప్రీం చేస్తున్న ప్రయత్నాన్ని కేంద్రం అడ్డుకుంటుందా? కొత్త ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తానని ప్రధాన న్యాయ మూర్తి ఎన్‌.వి.రమణతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి మోదీ ప్రభుత్వం ఆగస్టు 17న హామీ ఇచ్చింది. అయితే, సెప్టెంబరు 13వ తేదీన అంతకుముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ప్రమాణ పత్రం సమర్పించడం వీలుకాదని చెప్పి దేశ ప్రజలను నివ్వెరపరిచింది. తానిచ్చిన హామీని గాలికి వదిలేసి, సుప్రీంకోర్టు దేశ భద్రత గురించి ఆలోచించడం లేదని బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు, మద్దతుదారులకు సంకేతమివ్వాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు కంటే ఎక్కువ దేశభక్తి ఉందని, తానే ఎక్కువ జాతీయవాదినని ప్రభుత్వం చెప్పుకొనేందుకు ఎలా ప్రయత్నిస్తుంది? ఇందులో కుట్ర అంశం ఏమీ లేదని మోదీ ఆయన కనుసన్నలలో పనిచేసే న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి వాస్తవాలను ఎందుకు వెల్లడిరచడం లేదు? తన రాజకీయ ప్రత్యర్థుల పైన, జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతిని వ్యక్తం చేసే వారిపైన నిఘా ఉంచేందుకు మోదీ పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారన్న సందేహాలకు బలం చేకూరు తున్నది. కొంతమందితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దానిపై ప్రభుత్వం ఎలా ఆధారపడుతుంది? పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారాన్ని కోర్టుకు తెలిపేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మోదీ గౌరవనీయులైన న్యాయమూర్తుల మాట లను విశ్వసించటంలేదు కానీ జాతీయవాదులమని చెప్పుకునే ఆయన స్నేహి తులు, మద్దతుదారులు చెప్పే విషయాలను మాత్రం నమ్ముతారు. రాజ్యాంగ పరి రక్షణ బాధ్యత, ఉన్నత న్యాయస్థానంపై గౌరవం చూపాలన్న యోచన మోదీ ప్రభుత్వానికి ఎంత మాత్రమూ లేదు. ఆయన తన రాజకీయ ఎజెండా అమలు కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని చులకనగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించటానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఎందు కు లేదు? న్యాయ మంత్రిత్వ శాఖ చెప్పింది మరింత విచిత్రంగా ఉంది. పెగా సస్‌పై వాస్తవాలు ఏమిటో దర్యాప్తు చేయించాలని వేసిన పిటీషన్లు చాలినంత ఆధారం లేనివి, ఊహాజనితాలు, వాస్తవం కాని మీడియా వార్తలు అని తన ప్రమాణ పత్రంలో ఆ శాఖ పేర్కొన్నది. సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు కోసం అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం సమ ర్పించిన ప్రమాణ పత్రాన్ని పిటీషన్‌దారులు కూడా తిరస్కరించారు. ఇజ్రా యిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూపు రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయో గించారా లేదా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పిటీషన్‌ దారులు కోరారు. ప్రధాన న్యాయమూర్తి రమణ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రమాణ పత్రాన్ని ఎందుకు దాఖ లు చేయడంలేదు అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రమాణ పత్రం దాఖలు చేస్తే, వారు తమ పిటీషన్‌లను ఉపసంహరించు కుంటారా అనే ప్రశ్నను తనను తాను వేసుకుంటున్నానని చెప్పారు. అప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు ఇష్టపడటం లేదని తాము భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పెగాసస్‌ సమస్యపైన అసలు విషయాన్ని బయట పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయ వ్యవస్థ, మీడియాపై నిఘా ఉంచేందుకు ప్రయత్నించటం ఆందోళన కలి గించే అంశం. కోర్టుకు సైతం సమాచారం ఇవ్వకపోవటం ఏమిటి? న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఉన్నదా! లేదా! ప్రజాస్వామ్య పరిరక్షణకు, నియంతృత్వ అధికారాన్ని నిలువరించేందుకు న్యాయ వ్యవస్థ స్వతంత్రత తప్పనిసరి. మోదీ ప్రభుత్వ మొండి వైఖరి దేశానికి, ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయారు. తమ ప్రభుత్వం ఏమిటో ప్రజలకు అసలు వాస్తవాలను చెప్పి వారి నమ్మకాన్ని చూరగొనటానికి అవకాశం ఉంటుంది. డొంక తిరుగుడు సమాధానం వద్దని మోదీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మోదీ ప్రభుత్వం వాస్తవం చెప్పకపోతే, కోర్టు నిర్వహణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయటంలేదని దానికి బదులుగా స్వతంత్ర కమిటీతో ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తుందని పదే పదే తుషార్‌మెహతా చెప్పారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్‌, హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇచ్చిన గడువు లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయక పోతే తాము తీసుకోనున్న చర్యను ప్రకటిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాణ పత్రం దాఖలు చేయకపోతే మేము ఒక ఉత్తర్వును జారీ చేస్తాం. ఏం చేయాలి మరి? అని ప్రధాన న్యాయమూర్తి రమణ పేర్కొన్నారు. దీనిని బట్టి మోదీ ప్రభుత్వం ఈ సమస్యను రాజకీయంచేయాలని చూస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. తమ ప్రభుత్వం కోర్టు బాధితురాలని ప్రచారంచేసుకుని రానున్న ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆలోచన మోదీకి ఉందనిపిస్తోంది. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమాదకరమైన ఆటాడుతున్నాయి. మోదీ ప్రభుత్వం, కొంత మంది పైస్థాయి అధికారులు, కొందరుమంత్రులు ఈ కుట్రలోభాగస్వాములని చెప్పటానికి సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమాచారం దాచివేయాలన్న ఆలోచనలోనే కేంద్రం ఉంది. భారతదేశంలో దాదాపు 300 మంది పైన వారి మొబైల్‌ ఫోన్ల ద్వారా నిఘా ఉంచారని అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img