Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

భారత్‌కు భద్రతా మండలిలో చోటెప్పుడు!

కళ్యాణీ శంకర్‌

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఈ అంశాన్ని పదేపదే అమె రికా, ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఇంత వరకూ సాకారం కాలేదు. గత వారం వాషిం గ్టన్‌లో జరిగిన భేటీలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ దృష్టికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకువెళ్లారు. భద్రతా మండలిని విస్తరించాలని భారత దేశం ప్రధానమైన దేశాలను కోరుతూనే ఉన్నది. మనదేశం నుంచి అమె రికాకు వెళ్లిన అధినేతలు ఈ అంశాన్ని అనేక సార్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అమెరికాను పాలించిన అధ్యక్షులు జార్జిబుష్‌, బరాక్‌ ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌లు భారత సభ్యత్వాన్ని సమర్థించి నప్పటికీ ఇంతవరకు ఫలించలేదు. 2010 నవంబరులో ఒబామా మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మన పార్లమెంటులో మాట్లా డుతూ భారత్‌ ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశంగా పాల్గొనే సమ యం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ట్రంప్‌ కూడా బహిరంగం గానే మనకు మద్దతు తెలిపారు. తాజాగా బైడెన్‌ కూడా మద్దతు తెలిపిన జాబితాలో చేరారు. అంతేకాదు అణు సరఫరాల గ్రూపులో చేరడానికి కూడా ఆయన తోడ్పాటు ప్రకటించారు. ఐరాసలో సంస్కరణలు చేపట్టే సూచనలు కనిపించటం లేదు.
ఐరాస వ్యవస్థాపక సభ్యురాలైన భారత్‌ భద్రతామండలి శాశ్వత సభ్య దేశంగా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‌ రెండవ స్థానంలో ఉన్నది. పెద్ద ప్రజా స్వామ్య దేశం. ఐరాస శాంతి దళాలలో భారతదేశం కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. దాదాపు 2 లక్షల మంది సైనికులను 2007లో శాంతి దళా లుగా భారతదేశం పంపింది. వీరిలో మహిళలు కూడా గణనీయంగా ఉన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా చేరితే వివిధ దేశాల, ప్రపంచ స్థాయి సంస్థల రూపురేఖలను మార్చే శక్తిస్థోమతలను కలిగి ఉన్నదా అన్న యోచన ఉన్నది. ఐరాసలో సంస్కరణలు నత్త నడకగా ఉన్నాయని మోదీ గత సెప్టెంబరులో ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమా వేశంలో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. మేము ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థానం లేదు. ప్రపంచ స్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విధానాలను నిర్ణయించటం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎలాంటి ప్రాధా న్యతను ఇవ్వటం లేదు. శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ ఉన్నాయి. భారత్‌ను సభ్యదేశంగా తీసుకోవాలన్న ప్రతిపాదన వచ్చిన ప్రతిసారి ఈ ఐదు దేశాలలో ఏదో ఒకటి వీటో చేసి అడ్డుపడు తున్నాయి. నాలుగు దేశాలు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. భారత్‌, బ్రెజిల్‌, దక్షిణా ఫ్రికా, జర్మనీ, జపాన్‌లు శాశ్వత సభ్యత్వం కోసం పోటీ పడుతున్నాయి. దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాం నుంచి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాము. 1950లో వియత్నాంను తొలగించి భారతదేశాన్ని తీసుకోవా లని అమెరికా కోరినట్లుగా కొందరు చెబుతున్నారు. 1955లో సోవియట్‌ యూనియన్‌ చేసిన ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. నెహ్రూ ఐరాసలో భారత ప్రతినిధిగా ఉన్న విజయలక్ష్మీ పండిట్‌కు ఒక లేఖ రాశారు. భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్య దేశంగా తప్పనిసరిగా ఉండదగిన అర్హతలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. చైనాను తొలగించి ఆ స్థానంలో ఉండాలని ఆయన కోరుకోలేదు.
ఇప్పుడున్న ధోరణి చూస్తుంటే ఐరాసలో సంస్కరణలు చేపట్టే సూచనలు కనిపించడం లేదు. అమెరికా తదితర దేశాలు సంస్కరణలు గురించి మాట్లాడుతున్నాయేగాని భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో శ్రద్ధ చూపటం లేదు. ఐరాస ప్రధాన కార్యదర్శి కూడా సంస్కరణలు తీసుకు రావా లని మాట్లాడుతున్నారు. 2015లో ఆనాటి ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌ కొత్త దేశాలకు సభ్యత్వం కల్పించాలని సరిగ్గానే సూచించారు. అయితే ఇందుకు కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బలహీన దేశాలకు వ్యతిరేకంగా బలమైన తీర్మానాలు చేస్తున్నా రని, ధనిక దేశాలకు వ్యతిరేకంగా బలహీన తీర్మానాలు చేస్తున్నారని కోఫి అన్నన్‌ చెప్పారు. ఐరాస నిస్సహాయ స్థితిని అన్నన్‌ మాటలు తెలియ జేస్తున్నాయి. గడచిన 75 ఏళ్లలో ఐరాస తన విధులను సక్రమంగా నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ఐరాస నిఘా ఉన్నప్పటికీ నిరంకుశ పాలకులు అమాయక పౌరులపై సంప్రదాయ ఆయు ధాలను ప్రయోగిస్తూనే ఉన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసినప్ప టికీ సంపన్న దేశాలు పట్టించుకోవటం లేదు. ఆయా దేశాల మధ్య యుద్ధాలు జరుగకుండా చూడటం ఐరాస విధి. ఐరాస ఏర్పడిన తరువాత 80 చిన్న, పెద్ద యుద్ధాలు జరిగాయి. సంపన్న దేశాలు చెప్పినట్టు వినకపోతే ఐరాసకు నిధుల కొరత ఏర్పడుతుంది. ట్రంప్‌ తన పాలనా కాలంలో ఐరాసకు నిధులను నిలిపి వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. నిరంకుశ అగ్ర దేశాలు గట్టిగా చొరవ తీసుకోకపోతే భారత్‌కు శాశ్వత సభ్యత్వం తేలిక కాదనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img